HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Bhuvaneswari Nijam Gelavali Program 3

TDP : క్యాడ‌ర్‌కు భ‌రోసా ఇస్తున్న నారా భువ‌నేశ్వ‌రి.. ఉమ్మ‌డి తూ.గో జిల్లాలో నిజం గెల‌వాలి కార్య‌క్ర‌మం

  • Author : Prasad Date : 26-01-2024 - 7:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌టిస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ స‌మ‌యంలో మ‌ర‌ణించిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను ఆమె ప‌రామ‌ర్శిస్తున్నారు. అధైర్యపడొద్దు…పార్టీ మీ వెన్నంటే ఉందని కుటుంబ పెద్దలను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరిజల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. మొదటగా పి.గన్నవరం నియోజకవర్గం, ఐనవల్లి మండలం, ఎస్.మూలపాలెం గ్రామంలో పార్టీ కార్యకర్త మోరెంపూడి మీరాసాహెబ్ కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మీరాసాహెబ్(52) 25-10-2023న మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతిచెందారు. మీరాసాహెబ్ భార్య దుర్గమ్మ, తమ్ముడు బాలరాజును భువనేశ్వరి పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. అనంతరం అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం, చల్లపల్లి గ్రామంలో సాలాది వివ్వనాథం కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక విశ్వనాథం(58) 20-10-2023న గుండెపోటుతో మృతిచెందారు. విశ్వనాథం భార్య ఆదిలక్ష్మి, కుమార్తెలు జీవనజ్యోతి, రత్నకుమారి, కాంతలక్ష్మి లను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారికి రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజోలు నియోజకవర్గం, మల్కిపురం మండలం, విశ్వేశ్వరాయపురం గ్రామంలో పార్టీ కార్యకర్త చెల్లుబోయిన నరసింహారావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. నరసింహారావు(57), 09-09-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతిచెందారు. నరసింహారావు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు చంద్రకాంత్ లను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం అందించారు. రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం, సోంపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త సరెళ్ల పెద్దిరాజు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక పెద్దిరాజు(57), 17-10-2023న గుండెపోటుతో మృతిచెందారు. పెద్దిరాజు కుమారుడు రాంబాబు, కోడలు నాగలక్ష్మి, మనుమరాలు జాస్మిన్ లను భువనేశ్వరి పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు.

Also Read:  Gyanvapi Mosque : హిందూ ఆలయంపైనే జ్ఞానవాపి మసీదు.. ఏఎస్‌ఐ సంచలన నివేదిక

మండపేట నియోజకవర్గం, కపిలేశ్వరపురం మండలం, నల్లూరు గ్రామంలో పార్టీ కార్యకర్త జొన్నకూటి రాజు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. రాజు కుమార్తె అన్నపూర్ణ, కుమారుడు విజయ్ కుమార్ లను భువనేశ్వరి పరామర్శించి, ఓదార్చారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. చివరిగా మండపేట నియోజకవర్గం, మండపేట మండలం, పాలతోడు గ్రామంలో మందపల్లి ధర్మరాజు కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ధర్మరాజు(51), 17-09-2023న గుండెపోటుతో మృతిచెందారు. ధర్మరాజు భార్య మందపల్లి జ్యోతి, కుమార్తెలు వినీల, ప్రమీళ, కుమరుడు వరుణ్ లను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. రూ.3లక్షల ఆర్థికసాయం చేసి ధైర్యం చెప్పారు. అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, బలభద్రపురం గ్రామంలో బస చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 chandrababu cm
  • andhra pradesh
  • ap tdp
  • nara bhuvaneshwari
  • tdp

Related News

    Latest News

    • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

    • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

    • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

    • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

    • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

    Trending News

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd