Nara Bhuvaneshwari : తాత ఎక్కడ అని దేవాన్ష్ అడుగుతుంటే గుండె తరుక్కుపోతోంది – నారా భువనేశ్వరి
మనవడు దేవాన్ష్ తాత ఎక్కడికి వెళ్ళాడు..? ఇన్ని రోజులు అవుతుంది..? ఎందుకు రావడం లేదు..? అని అడుగుతుంటే గుండె తరుక్కుపోతోంది
- By Sudheer Published Date - 07:21 PM, Thu - 26 October 23

చంద్రబాబు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరిట యాత్ర చేపట్టింది. నేడు రెండో రోజుకు ఈ యాత్ర చేరుకుంది. గురువారం తిరుపతి, శ్రీకాళహస్తిలో యాత్ర కొనసాగింది. చంద్రబాబు అక్రమ అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా మహిళలతో సమావేశమవుతూ..వారు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో భువనేశ్వరి కాస్త భావద్వేగానికి గురయ్యారు. మనవడు దేవాన్ష్ తాత (Chandrababu) ఎక్కడికి వెళ్ళాడు..? ఇన్ని రోజులు అవుతుంది..? ఎందుకు రావడం లేదు..? అని అడుగుతుంటే గుండె తరుక్కుపోతోంది. విదేశాలకు వెళ్లాడని చెప్పుకుంటూ వస్తున్నామని తెలిపింది. కుంభకోణం అని చెబుతున్న డబ్బు ఏ అకౌంట్ లోకి వెళ్లింది అని చెప్పడం లేదన్న ఆమె.. ప్రజల సొమ్ము మా కుటుంబానికి అవసరం లేదన్నారు. సీఐడీ ఎప్పుడైనా వచ్చి విచారించుకోవచ్చు అని సూచించారు.
ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఆయన్ను (Chandrababu) ప్రజలకు దూరం చేయాలని, ఓర్వలేకే ఇలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి నుంచి నాకు కొంత పౌరుషం వచ్చింది.. చంద్రబాబు నుంచి క్రమశిక్షణ, ఓర్పు నేర్చుకున్నానని తెలిపారు. ఎప్పుడూ బయటకు రాని మహిళలు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అది చంద్రబాబు పై ఉన్న నమ్మకం అన్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల చేసిన లేఖపై కూడా విచారణ అంటే ఆశ్చర్యం వేస్తుందన్న ఆమె.. పనికిమాలిన అంశాలపై విచారణ ఏంటి? ప్రజల సమస్యలు గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని సలహా ఇచ్చారు. మేం చంద్రబాబు ఆహారంలో విషం కలుపుతున్నామని అంటున్నారు.. వారి ఆలోచన అంత హీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : KTR: కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలి- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్