HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Should Dry Up Its Anti Farmer Attitude Brs Working President Ktr

KTR: కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలి- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసేలా రైతుబంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా ఎండగట్టాలని కేటీఆర్ అన్నారు.

  • Author : Balu J Date : 26-10-2023 - 6:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr
Ktr

KTR: కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసేలా రైతుబంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా ఎండగట్టాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నాయకుకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిపైన వెంటనే ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రం, ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దగ్ధంతోపాటు ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించి కాాంగ్రెస్ తీరును ఎండగట్లాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ రైతు బంధు అపాలంటూ ఎలక్షన్ కమీషన్ పిర్యాదు చేసి, రైతులను ఆగం చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న ఈకార్యక్రమాన్ని కేవలం అక్కసుతో అపాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఇప్పటికే 11సార్లు పంట సీజన్లకు అనుగుణంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. కానీ కాంగ్రెస్ ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతులకు సహాయం అపాలని ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఇలా కోడ్ పేరుచెప్పి ప్రభుత్వం అందిస్తున్న ఇంటింటికి మంచినీళ్లు …ఇరవై నాలుగు గంటల కరెంటును కూడా ఆపెయ్యమంటరా అని ప్రశ్నించారు. మరీ అన్ని సంక్షేమ పథకాల్లో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? దీంతో అన్ని పథకాలను కాంగ్రెస్ అపాలంటుందా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అంటేనే… రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని, అన్నదాతల పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అన్నారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరని హెచ్చరించారు. అన్నదాతల పొట్టకొట్టే..కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరన్నారు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలను ప్రజలు కట్ చేయడం పక్కా అన్నారు.

ఇప్పటికే.. నమ్మి ఓటేసిన పాపానికి… కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరన్నారు. తెలంగాణ రైతులకు.. కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారన్నారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసేలా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు
తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • ktr
  • TCongress
  • teleconference

Related News

KCR support women reservation bill

KCR: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన కేసీఆర్..

మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన గళాన్ని వినిపించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావులతో నిర్వహించిన భేటీలో జాతీయ రాజకీయ పరిణామాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుక

    Latest News

    • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

    • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

    • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    Trending News

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd