Nandikotkur MLA Arthur Thoguru : వైసీపీ కి భారీ షాక్..కాంగ్రెస్ లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే
రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్‌కు కేటాయించడంతో పాటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల కారణంగా..ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
- Author : Sudheer
Date : 19-03-2024 - 2:41 IST
Published By : Hashtagu Telugu Desk
ఓ పక్క సిద్ధం..మీమంతా సిద్ధం అంటూ జగన్ అంటుంటే..మీము కూడా పక్క పార్టీల్లోకి సిద్ధం అంటూ వరుసపెట్టి నేతలు జగన్ (Jagan) కు షాక్ ఇస్తున్నారు. ఓ పక్క ఎన్నికల డేట్ వచ్చేసింది..ప్రచారం ముమ్మరం చెయ్యాలి..నేతలంతా ప్రజల్లోకి వెళ్ళాలి అని జగన్ దిశా నిర్దేశాలు చేస్తుంటే..ఇంకోపక్క జగన్ నీ ఫై నమ్మకం లేదంటూ నేతలు పార్టీ కి గుడ్ బై టీడీపీ , జనసేన లలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు , ఎమ్మెల్యేలు , కీలక నేతలు చేరగా…తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు (Nandikotkur )లో వైసీపీ (YCP)కి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ (Nandikotkur MLA Arthur Thoguru) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila) సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్‌కు కేటాయించడంతో పాటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల కారణంగా..ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నందికొట్కూరు నుంచి పోటీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. టికెట్ రాకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆర్థర్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఓడిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.. ఈ జాబితాలో ఆర్థర్ పేరు ఉంటుందని ఆయన అభిమానులు, అనుచరులు ఆశిస్తున్నారు. అయితే టికెట్ హామీతోనే కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి టీడీపీలో చేరాలని అనుకున్నప్పటికీ ఇక్కడ్నుంచి అభ్యర్థి ఉండటంతో టికెట్ రాదని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని అభిమానులు చెప్పుకుంటున్నారు.
Read Also : Jagan Bus Yatra Schedule : జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు