Big shock for Jagan : ఏపీలో మరో 6 పథకాల పేర్లు మార్పు..
అధికారం చేపట్టిన చంద్రబాబు..జగన్ తీసుకొచ్చిన పథకాల పేర్లు మారుస్తూ వస్తున్నారు. ఇప్పటీకే పలు పథకాల పేర్లు మార్చిన బాబు..తాజాగా మరో ఆరు పథకాల పేర్లు మార్చారు
- Author : Sudheer
Date : 23-08-2024 - 4:35 IST
Published By : Hashtagu Telugu Desk
ఏ రాష్ట్రంలో నైనా ప్రభుత్వం మారిందంటే చాలు..గత ప్రభుత్వం తాలూకా పథకాల పేర్ల మార్పు అనేది తప్పనిసరి. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే..గత సీఎం జగన్..అధికారంలోకి రాగానే..టిడిపి పథకాల పేర్లను మార్చడం..కొన్ని పథకాలను తీసేయడం చేసాడు. ఇక ఇప్పుడు అధికారం చేపట్టిన చంద్రబాబు..జగన్ తీసుకొచ్చిన పథకాల పేర్లు మారుస్తూ వస్తున్నారు. ఇప్పటీకే పలు పథకాల పేర్లు మార్చిన బాబు..తాజాగా మరో ఆరు పథకాల పేర్లు మార్చారు. ఈ పథకాలన్నీ పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న పథకాలే కావడం విశేషం.
We’re now on WhatsApp. Click to Join.
పేర్లు మారిన పథకాలు ఏంటి అంటే..
అమ్మఒడి పథకం పేరు తల్లికి వందనంగా మార్పు
గోరుముద్ద పథకం పేరు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్పు
జగనన్న ఆణిముత్యాలు పథకానికి అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారంగా నామకరణం
స్వేచ్ఛ పథకానికి బాలికా రక్షగా పేరు మార్పు
విద్యాకానుక పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్రగా పేరు మార్పు
పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం మన బడి – మన భవిష్యత్ గా మార్పు
Read Also : Air India Fined: ఎయిర్ ఇండియాకు రూ.90 లక్షల జరిమానా