HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >My Care Address Is Hindupur

నా కేరాఫ్ అడ్రస్ హిందూపూర్.!

  • Author : Vamsi Chowdary Korata Date : 21-02-2026 - 4:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balayya Building House In Hindupur
Balayya Building House In Hindupur

Nandamuri Balakrishna  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శలకు చెక్ పెట్టారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉండరంటూ వైసీపీ నేతలు బాలయ్యపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూపురంలో సొంతింటి నిర్మాణం తలపెట్టారు బాలకృష్ణ. వన్నమ్మ కాలనీలో బాలకృష్ణ సొంత ఇల్లు నిర్మిస్తున్నారు. శుక్రవారం రోజున ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడిన బాలకృష్ణ ఇక నుంచి తన కేరాఫ్ హిందూపురమే అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హిందూపురంలోని వన్నమ్మ కాలనీలో బాలకృష్ణ సొంత ఇల్లు నిర్మించుకోనున్నారు. ఇందుకోసం శుక్రవారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సొంతింటి నిర్మాణం కోసం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర పూజలు నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన బాలకృష్ణ.. ఇక నుంచి తన కేరాఫ్ హిందూపురమేనని ప్రకటించారు. తన తండ్రి ఎన్టీఆర్‌ను హిందూపురం నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని.. మూడుసార్లు ఎమ్మెల్యేని చేయడమే కాకుండా రాష్ట్రానికి సీఎంను చేశారని అన్నారు.

ఆయన వారసుడిగా తనను కూడా మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిపించారన్న బాలకృష్ణ.. అందుకే హిందూపురం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఇక్కడే సొంతిల్లు కట్టుకుంటున్నట్లు చెప్పారు. హిందూపురంలో సొంతిల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నానని.. ఇన్ని రోజులకు తన కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. హిందూపురం నియోజకవర్గా్న్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.

విమర్శకుల నోళ్లు మూయించేలా..

అయితే హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండరంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ బాలయ్య.. ఎన్నిసార్లు ప్రజలకు కనిపించారంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కూడా ఆ మధ్య విమర్శలు చేశారు. మీటింగ్ ఉంటే వచ్చి ముఖం చూపించి పోతారని.. ఇక్కడి సమస్యలు ఆయనకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి ఏం బాధ్యత తీసుకుంటారంటూ గతంలో విమర్శలు చేశారు.

మరో అడుగు ముందుకేసిన వైసీపీ ఇంఛార్జి భర్త..

యాంకర్ శ్యామల విమర్శలు ఇలా ఉంటే.. వైసీపీ హిందూపురం నియోజకవర్గం ఇంఛార్జి దీపిక భర్త వేణు రెడ్డి గతేడాది చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో అడుగు ముందుకేసిన వేణు రెడ్డి.. బాలయ్యపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ప్రజలు 40 సంవత్సరాల నుంచి బానిస బతుకులు బతుకుతున్నారని.. ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చున్నోడి కాళ్ల కింద బానిసలుగా మారారంటూ వేణు రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. మనం వారికి ఓట్లేస్తే.. వారు మాత్రం హైదరాబాద్‌లో ఉంటారంటూ వేణు రెడ్డి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టేలా నందమూరి బాలకృష్ణ హిందూపురంలో సొంత ఇల్లు కట్టుకుంటున్నారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • hindupur
  • Hindupur MLA Nandamuri Balakrishna
  • Own House

Related News

Isuzu Ongole2

Isuzu : ఒంగోలు లో అత్యాధునిక 3S డీలర్‌షిప్‌ ప్రారంభం

వినియోగదారులకు నిరంతర సేవలు మరియు ఉన్నతమైన యాజమాన్య అనుభవాన్ని (Ownership Experience) అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కేవలం వాహనాలను విక్రయించడమే కాకుండా, విక్రయానంతర సేవల్లోనూ (After-sales service) నాణ్యత

    Latest News

    • String Metaverse Limited : ‘ఆఫర్ ఫర్ సేల్’ సూపర్ సక్సెస్

    • Yezdi : యెజ్డీ నుండి స్క్రాంబ్లర్ బైక్స్ ..ఫీచర్లు కేక

    • BJPలో చేరిన రాఘవ్ చడ్డా

    • Peddi : జూన్ 25 న ‘పెద్ది’ రిలీజ్ ?

    • AAP : ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ..!!

    Trending News

      • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

      • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

      • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd