Murder : కాకినాడలో దారుణం.. ప్రియుడితో కలిసి దత్తత తల్లిన చంపిన కూతురు
కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. దత్తత తీసుకున్న తల్లిని ఓ బాలిక తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన
- Author : Prasad
Date : 22-10-2023 - 8:08 IST
Published By : Hashtagu Telugu Desk
కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. దత్తత తీసుకున్న తల్లిని ఓ బాలిక తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన ఇప్పుడు కాకినాడలో సంచలనం కలిగిస్తుంది. 13 ఏళ్ల బాలిక చేసిన పనికి స్థానికులు ఖంగుతిన్నారు. హత్య చేసిన తరువాత తన తల్లి మరణాన్ని సహజంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఈ కేసులో నిజాల్ని వెలికితీశారు. మరొక మైనర్‌తో సహా ముగ్గురు వ్యక్తులను ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరం డీఎస్పీ విజయ్ పాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్గరెట్ జూలియానా(63), ఆమె భర్త నాగేశ్వరరావు దంపతులు 13 ఏళ్ల క్రితం నిరుపేద బాలికను కుమార్తెగా దత్తత తీసుకున్నారు. జూలియానా భర్త నాగేశ్వరరావు 2021లో మరణించారు. అప్పటి నుండి అమ్మాయి తన తల్లి మాట వినకుండా చెడు మార్గంవైపు వెళ్తుంది. దీనిని గమనించిన తల్లి జూలియానా ఆమెను మందలించింది.
We’re now on WhatsApp. Click to Join.
శనివారం జూలియానా బాత్‌రూమ్‌లో పడి స్పృహతప్పి పడిపోయింది. దీనిని సద్వినియోగం చేసుకున్న యువతి తన ప్రేమికుడు గార అశోక్ (19)కి సమాచారం అందించడంతో అతడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చి జూలియానాను ఊపిరాడ కుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని బాలిక తన బాబాయ్‌కి ఫోన్ చేసి చెప్పింది. అతను వచ్చి జూలియానాను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు ఆమె చనిపోయిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తన మోహం, మెడమీద గాయాలు చూసి ఊపిరాడక మృతి చెంది ఉంటారని అనుమానించారు. బాలికను ఆరా తీయగా అసలు నిజం బయటపడింది. దీంతో హత్యకు సహకరించిన ముగ్గురు నిందితులను, బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: TDP – JSP : రేపు టీడీపీ, జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ తొలిభేటీ