HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Montha Cyclone Effect In Ap

Montha Cyclone Effect : చిరుగుటాకులా వణుకుతున్న ఏపీ

Montha Cyclone Effect : ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని ఢీకొన్న మొంథా తుఫాను బీభత్సం సృష్టించింది. ఆదివారం అర్థరాత్రి మొదలుకొని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, బలమైన గాలులతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాలు వణికిపోయాయి

  • By Sudheer Published Date - 10:20 AM, Wed - 29 October 25
  • daily-hunt
Montha Cyclone Effect Ap
Montha Cyclone Effect Ap

ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని ఢీకొన్న మొంథా తుఫాను బీభత్సం సృష్టించింది. ఆదివారం అర్థరాత్రి మొదలుకొని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, బలమైన గాలులతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాలు వణికిపోయాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తృతంగా చెట్లు విరిగి రహదారులపై అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ స్థంబాలు నేలకొరిగి, వాటి ప్రభావంతో ముందుగానే అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయాల్సి వచ్చింది. తీర ప్రాంతాల్లో 90 నుండి 100 కిలోమీటర్లు వేగంతో వీచిన గాలులు రాకాసి అలలను ఉప్పొంగించాయి. ఏడు జిల్లాల్లో పెనుగాలులు భారీ నష్టానికి కారణమయ్యాయి.

‎Diabetes Winter Care: షుగర్ సమస్య ఉన్నవారు చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలుసా?

మొంథా తుఫాను కారణంగా బంగాళాఖాతంలో అలలు ఉధృతంగా ఎగిసి పడుతుండటంతో కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్‌ జారీచేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలిచ్చింది. మహేంద్రతనయ, వంశధార, నాగావళి వంటి నదులు ఒడిషా నుండి వస్తున్న వరదల ప్రభావంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విశాఖ–పాడేరు మార్గంలో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తుండగా, అరకు–విశాఖ రైలుమార్గంలో కొండచరియలు జారిపడటంతో రైల్వే ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. అధికారులు పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు.

వ్యవసాయ రంగం కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వరి, ఉద్యాన పంటలు వరద నీటితో మునిగిపోయి రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వ సహాయం వెంటనే అందించాలని వారు కోరుతున్నారు. మత్స్యకార గ్రామాల్లో పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. కాకినాడ సమీపంలో ఓ మత్స్యకారుడు అలలలో కొట్టుకుపోయిన ఘటన స్థానికులను కలవరపరుస్తోంది. ఒంగోలు పట్టణంలో ప్రధాన రహదారులు వరద నీటితో మునిగిపోవడంతో పౌరులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద 3,000 మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించగా, 60 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రమాదాన్ని ఎదుర్కొనే ఏర్పాట్లు ప్రభుత్వం కొనసాగిస్తోంది. మొంథా తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Montha Cyclone
  • Montha Cyclone Effect

Related News

Montha Cyclone Effect Telug

Montha Cyclone : ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు అందిస్తున్న ఏపీ సర్కార్

Montha Cyclone : ప్రజలు రోజువారీగా అవసరమయ్యే ప్రధాన సరుకులను ప్రతి కుటుంబానికి అందించేందుకు నిర్ణయం తీసుకుంది. సాధారణ కుటుంబాలకు 25 కిలోల బియ్యం, 1 లీటర్ నూనె, 1 కిలో కందిపప్పు, 1 కిలో చక్కెర, 1 కిలో చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయలు అందజేయనున్నారు

  • Montha Cyclone Ap Cm Chandr

    Montha Cyclone : పెను తూఫాన్ నుండి ఏపీ ని కాపాడింది వీరే..!!

  • Montha Cyclone Effect Telug

    Montha Cyclone Effect : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు

  • Ap Electricity Problems

    Electricity Problems : ఏపీలో విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టిన ప్రభుత్వం..ఎలా అంటే !!

  • Montha Cyclone

    Montha Cyclone : రాత్రికి తీరం దాటనున్న మొంథా తుపాను..ఏపీలో భారీ వర్షాలు

Latest News

  • Jahnavi Swaroop : సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!

  • Jupally Krishna Rao : జూపల్లి ని దెబ్బ తీయాలని చేస్తుందేవరు..?

  • Montha Cyclone Effect : చిరుగుటాకులా వణుకుతున్న ఏపీ

  • Jamaica Floods: జమైకాలో కుంభవృష్టి..ప్రమాదంలో వేలాదిమంది

  • Early Morning : ఉదయం నిద్రలేవగానే చేయాల్సిన పనులు

Trending News

    • Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!

    • Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్‌గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?

    • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

    • Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!

    • Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd