Diabetes Winter Care: షుగర్ సమస్య ఉన్నవారు చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలుసా?
Diabetes Winter Care: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు చలికాలంలో తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:18 AM, Wed - 29 October 25
Diabetes Winter Care: చలికాలం మొదలయింది. దీపావళి తర్వాత మొదలయ్యే కార్తీకమాసం నుంచి శివరాత్రి వరకు ఈ చలికాలం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు కురిసే ఈ వర్షాల వల్ల చలి తీవ్రత మరింత పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ చలికాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే, ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు రక్తంలో చక్కెర పెరుగుతుంది.
మంచు, చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు వర్కౌట్ తక్కువ చేయడం, వేడివేడిగా ఉన్న ఫుడ్స్ ని తినడం వంటి కారణాలు ఉన్నాయి.
ఎక్కువగా చలి ఉండడం అనేక సమస్యల్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా రక్తనాళాలు కుచించుకుపోతాయట. దీంతో పాదాలు, చేతుల్లో తిమ్మిరి వస్తుందని, ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని, అదే విధంగా ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల HbA1c స్థాయిలు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని ఇది షుగర్ ఉన్నవారికి ప్రమాదమని చెబుతున్నారు. చలి కారణంగా జలుబు, దగ్గు, ఫ్లూ, సైనస్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
దీంతో మీ బాడీ ఒత్తిడిగా ఫీలై అనారోగ్యానికి కారణమయ్యే హార్మోన్లని రిలీజ్ చేస్తుందట. ఈ హార్మోన్లు కూడా బ్లడ్ షుగర్ లెవల్స్‌పై ప్రభావం చూపి ఇబ్బందులకు గురి చేస్తాయట. ఎప్పుడు శరీరాన్ని పొడిగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా సీజనల్ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడేందుకు శుభ్రంగా ఉండాలట. చేతులను ఎప్పటికప్పుడు కడగడం ద్వారా జెర్మ్స్ ని దూరం చేసిన వారవుతారట. దీని వల్ల చలికాలంలో వచ్చే సమస్యల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, చలికాలంలో మీ రక్తంలో షుగర్ పెరగకుండా ఉండటం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. చలి వాతావరణం మీరు టెస్ట్ చేసే టూల్స్‌ని, మెడిసిన్స్ ని ప్రభావితం చేస్తాయట. ఇది మీ శరీరంపై ఎఫెక్ట్ ని చూపిస్తుందని, కాబట్టి వీటిని వేడిగా ఉన్న ప్రాంతాల్లో పెట్టాలని చెబుతున్నారు. వర్కౌట్ చేయడానికి ఇంటి బయటికి వెళ్ళడం ఇబ్బందిగా ఉంటే మెట్లు ఎక్కడం, ఇంట్లోనే డ్యాన్స్ చేయడం, యోగా, ధ్యానం వంటి ఇండోర్ వర్కౌట్స్ ట్రై చేయవచ్చట. కొద్దిగా సేపైనా చెమట వచ్చేలా స్పీడ్ వాక్ చేయడం మంచి పద్ధతని దీని వల్ల శరీరం వెచ్చగా మారుతుందని చెబుతున్నారు.