Nara Lokesh: నారా దేవాన్ష్ కి ప్రధాని మోదీ ఆశీర్వాదం
Nara Lokesh: దేవాన్ష్‌ను ఒడిలో కూర్చుపెట్టుకొని, ముద్దు పెట్టి ఆశీర్వదించారు. లోకేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు
- By Sudheer Published Date - 11:29 AM, Sun - 18 May 25

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తన భార్య నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్(Nara Devansh)తో కలిసి శనివారం న్యూఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీతో కలిసిన లోకేష్ కుటుంబాన్ని ప్రధాని మోదీ సాదరంగా ఆతిథ్యం అందించారు. దేవాన్ష్‌ను ఒడిలో కూర్చుపెట్టుకొని, ముద్దు పెట్టి ఆశీర్వదించారు. లోకేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Schools Reopen : స్కూళ్ల రీఓపెన్ రోజే బుక్స్ , యూనిఫాం – సీఎం రేవంత్
ఈ సందర్భంగా ‘యువగళం’ పేరుతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. యువగళం పాదయాత్రలోని విశేషాలు, ప్రజలతో లోకేష్ భేటీలు, సమస్యల పరిష్కారానికి ఆయన వినూత్న ప్రయత్నాల వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. మోదీ మొదట ఈ పుస్తకంపై సంతకం చేసి, లోకేష్‌కు అందజేశారు. ఈ క్షణాన్ని ఎంతో గౌరవంగా భావించిన లోకేష్, ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ ఇచ్చిన మద్దతుకు నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ రాష్ట్రానికి కేంద్రం పునరుత్థానానికి దోహదపడేలా మార్గదర్శకత్వం ఇవ్వాలని కోరారు. ఈ మధురమైన సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వివరాలను నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అవి వైరల్‌గా మారాయి.