HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Modi Wishesh To Cbn

CBN Birthday : చంద్రబాబు ఫై మోడీ ప్రశంసలు..

అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం ఏపీ అభివృద్ధి గురించే పరితపిస్తారని , చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు

  • Author : Sudheer Date : 20-04-2024 - 4:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn Modi
Cbn Modi

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ (PM Modi) చంద్రబాబు ఫై ప్రశంసలు కురిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. నేడు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు.

ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా తెలుగు ప్రజలు, టీడీపీ అభిమానులు , నందమూరి అభిమానులు ఇలా అనేక వర్గాల వారు చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఉదయం నుండే పెద్ద ఎత్తున పలు సేవ కార్యక్రమాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా లో అయితే CBNbirthday ట్రెండ్ అవుతూ వస్తుంది. సినీ , రాజకీయ ప్రముఖులంతా చంద్రబాబు కు బెస్ట్ విషెష్ ను అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా(ఎక్స్) చంద్రబాబు కు శుభాకంక్షలు అందజేశారు. అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం ఏపీ అభివృద్ధి గురించే పరితపిస్తారని అన్నారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అంతకు ముందు మెగా బ్రదర్స్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు చంద్రబాబు బెస్ట్ విషెష్ అందజేశారు.

‘అహర్నిశం ప్రజల మధ్య ఉంటూ… ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేయగా.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాజకీయంగా, పాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు గారు నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచిస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు ఎన్ని ఎదురైనా ధృడ చిత్తంతో ఎదుర్కొంటారు. వైసీపీ సర్కార్ బనాయించిన కేసులతో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనో నిబ్బరం కోల్పోలేదు. పరిపాలన పటిమతో రాష్ట్ర అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు గారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

తన తన పుట్టిన రోజు వేడుకలను చంద్రబాబు అనంతపురం జిల్లాలో పాఠశాల విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేక్ కట్ చేశారు. ఇక హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ శ్రేణులు, అభిమానుల మధ్య ఘనంగా చంద్రబాబు జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. మంగళగిరిలో నారా బ్రాహ్మణి మహిళలలో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Birthday wishes to former Andhra Pradesh CM Shri @ncbn Garu. An experienced leader, he has always devoted himself towards AP's all round progress. I pray that he is blessed with a long and healthy life in service of the people.

— Narendra Modi (@narendramodi) April 20, 2024

శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు –
JanaSena Chief Shri @PawanKalyan@ncbn#HBDBabu #HappyBirthdayCBN pic.twitter.com/8tr5A3vy7a

— JanaSena Party (@JanaSenaParty) April 20, 2024

అహర్నిశం ప్రజల మధ్య ఉంటూ,
ప్రజా సంక్షేమం కోసం పాటుపడే
శ్రీ నారా చంద్రబాబునాయుడు @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 💐

— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2024

Read Also : CM Revanth Vs KCR : నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు.. తెలుసుకో కేసీఆర్ : రేవంత్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CBN Birthday 2024
  • chandrababu
  • modi

Related News

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd