TDCO Houses : టిడ్కో ఇళ్ల పై మంత్రి నారాయణ క్లారిటీ
టిడ్కో ఇళ్ల అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం 22,640 ఇళ్లను తొలగించి వేరే వారికి కేటాయించిందని, 77,606 మందికి ఇళ్లు ఇవ్వకుండానే వారి పేరుపై రుణం తీసుకున్నారని తెలిపారు. బ్యాంకు బకాయిలకు ప్రభుత్వం రూ.140కోట్లకు అనుమతిచ్చిందని త్వరలోనే చెల్లిస్తామన్నారు.
- Author : Latha Suma
Date : 13-03-2025 - 1:12 IST
Published By : Hashtagu Telugu Desk
TDCO Houses : ఏపీ అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై క్వశ్చన్ అవర్‌లో సభ్యులు ప్రశ్నలు వేశారు. బ్యాంక్ లోన్ కట్టలేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆవేదిన వ్యక్తం చేశారు సభ్యులు మాధవి రెడ్డి.. కొండబాబు.. సింధూర రెడ్డి.. జోగేశ్వర రావు.. లబ్ధిదారులకు వెంటనే టిడ్కో ఇళ్లు ఇవ్వాలని సభ్యులు కోరారు. వడ్డీలు కట్టలేక.. అటు అద్దె ఇళ్లల్లో ఉండలేక ఇబ్బందులు పరిష్కరించాలని కోరారు. అనంతరం మంత్రి నారాయణ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
Read Also: Gudivada Amarnath : జగన్ కోటరీ అంటే అది ప్రజలే: అమర్ నాథ్
టిడ్కో ఇళ్ల అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం 22,640 ఇళ్లను తొలగించి వేరే వారికి కేటాయించిందని, 77,606 మందికి ఇళ్లు ఇవ్వకుండానే వారి పేరుపై రుణం తీసుకున్నారని తెలిపారు. బ్యాంకు బకాయిలకు ప్రభుత్వం రూ.140కోట్లకు అనుమతిచ్చిందని త్వరలోనే చెల్లిస్తామన్నారు. జూన్ 12 నాటికి పెండింగ్‌లో ఉన్న 365,430 చదరపు అడుగుల ఇళ్లను పూర్తి చేస్తామని తెలిపారు.
గత ప్రభుత్వానికి ప్లానింగ్ లేదు. 2 ఎకరాలు టిడ్కో ఇళ్ల కాంప్లెక్స్ దగ్గర ఉంచితే అది కూడా గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. ఏడు లక్షలకు పైగా ఇళ్లు టిడ్కోలో మంజూరు అయ్యాయి. 4 లక్షలకు పైగా ఇళ్లకు టెండర్లు పిలిచాం. వాటిలో గత ప్రభుత్వం కొన్ని ఇళ్లు రద్దు చేసిందని మండిపడ్డారు మంత్రి నారాయణ. కేవలం గత ప్రభుత్వం 57 వేల ఇళ్ల నిర్మాణం చేసింది. టిడ్కో ఇళ్లలో మంచి సౌకర్యాలు ఉన్నాయి. రోడ్లు, పార్కులు, స్కూళ్లు.. షాపింగ్ కాంప్లెక్స్ ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అప్పట్లో సీఎం చంద్రబాబు టిడ్కో ఇళ్ల దగ్గర ఎకనామిక్ ఆక్టివిటీ ఉండాలన్నారు.