HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Nara Lokesh At The Ministerial Subcommittee Meeting On The Creation Of 20 Lakh Jobs

Nara Lokesh: 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశంలో మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇన్వెస్ట్ మెంట్ ట్రాకర్ పోర్టల్ ను సమర్థంగా తీర్చిదిద్దాలి. ఉద్యోగాల కల్పనకు ప్రతి పాలసీలో సంస్కరణలు! ఎంఎస్ఎమ్ఈలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశంలో మంత్రి లోకేష్ దిశానిర్దేశం.

  • Author : Kode Mohan Sai Date : 25-03-2025 - 2:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. ఉండవల్లి నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటుచేసిన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం జరిగింది. ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనతో పాటు వివిధ ఎంవోయూల స్థితిగతులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ.8,73,220 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 5,27,824 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. మంత్రుల ఉపసంఘం ఛైర్మన్ హోదాలో మంత్రి లోకేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇన్వెస్ట్ మెంట్ ట్రాకర్ పోర్టల్ ను సమర్థంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. భూకేటాయింపులు, అనుమతులకు సంభందించిన అన్ని వివరాలు ట్రాకర్ లో ఉంచాలన్నారు.

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటుచేసిన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం సోమవారం ఉండవల్లి నివాసంలో జరిగింది. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ.8,73,220 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 5,27,824 మందికి… pic.twitter.com/khN62UGjN4

— Lokesh Nara (@naralokesh) March 25, 2025

పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ప్రతిబంధకంగా మారిన విధానాల్ని సంస్కరిస్తామని చెప్పారు. ఉద్యోగాల కల్పనకు ప్రతి పాలసీలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగాను, దేశంలోనూ ఉన్న అన్ని పెద్ద కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించాలని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు మరింతగా విస్తరించేలా వారిలో నమ్మకం కల్పించాలని, వారికి ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు.

వారికి అవసరమైన భూకేటాయింపులతో పాటు అనుమతులు, రాయితీలు త్వరితగతిన మంజూరు చేయాలి. ఎంఎస్ఎమ్ఈ రంగంలో పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఎంఎస్ఎమ్ఈలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం. ఐటీఐ, పాలిటెక్నిక్ ల ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించాలి. పోర్టుల అభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించాలి. టూరిజం రంగంలో పెట్టుబడులు ఆకర్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.

మైనింగ్ రంగంలోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఈ రంగంపైనా దృష్టిసారించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, ఎంఎస్ఎమ్ఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులు అజైయ్ జైన్, ఎన్.యువరాజ్, కాటమనేని భాస్కర్, ప్రవీణ్ కుమార్, సాయికాంత్ వర్మ, ఎమ్.అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 20 lakhs Jobs to AP People
  • AP Unemployed People
  • Nara Chandrababu Naidu
  • nara lokesh
  • Nara Lokesh Promise To Unemployed Youth
  • Pawan Kalyan

Related News

Nani Pawan

Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రం నుండి విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాటపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

  • Allu Sirish Wedding

    అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Will Reveal Facts About Srivari Laddu Adulteration In The Assembly Tomorrow .. Minister Lokesh

    రేపు అసెంబ్లీలో శ్రీవారి లడ్డూ కల్తీ పై వాస్తవాలను బయటపెడతా : మంత్రి లోకేశ్‌

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

Latest News

  • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

  • Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో జెన్ జెడ్ విప్లవం

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. కీల‌క ఆట‌గాడికి గాయం?

Trending News

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd