HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Nadendla Manohar Shocking Comments

CM Chandrababu : పవన్ కల్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం అయ్యాడు – నాదెండ్ల మనోహర్

CM Chandrababu : జనసేన మద్దతు లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని, కూటమి విజయానికి జనసేనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు

  • Author : Sudheer Date : 11-03-2025 - 8:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn Cm Pawan
Cbn Cm Pawan

జనసేన పార్టీ కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) చేసిన తాజా వ్యాఖ్యలు (Shocking Comments) ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం (Chandrababu) కావడం వెనుక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్ర (Key Role) ఉందని స్పష్టం చేశారు. జనసేన మద్దతు లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని, కూటమి విజయానికి జనసేనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇటీవలి కాలంలో జనసేన-టీడీపీ మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ముఖ్యంగా పదవుల పంపిణీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

CM Revanth : కేటీఆర్ పిచ్చోడు – సీఎం రేవంత్

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జనసేనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆ పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేత వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఎన్నికల సమయంలో పిఠాపురం సీటు వదులుకుంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న చంద్రబాబు హామీ అమలు కాలేదు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్సీ జాబితా విడుదల అయినా వర్మకు మొండి చేయి ఎదురైంది. జనసేన నేతలే ఆయనకు అడ్డుగా నిలుస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ-జనసేన సంబంధాలను మరింత ఉద్రిక్తతకు గురిచేస్తాయా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. జనసేన నేతలే వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకుండా టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని నాదెండ్ల వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో, కూటమి సంబంధాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu CM
  • CM Chandrababu
  • Minister Nadendla Manohar
  • Minister Nadendla Manohar Shocking Comments
  • Pawan Kalyan

Related News

Ustaad Bhagat Singh Trailer

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

ఈ చిత్రంలో పార్తీబన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, శ్రీలీల పాత్ర కథలో కీలకమైన మలుపులతో పాటు వినోదాన్ని పంచే విధంగా ఉంది.

  • Janasena 13th Formation Day

    Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!

  • Ap Cm Chandrababu Naidu

    Local Body Elections in AP : స్థానిక ఎన్నికల అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

  • Kutami Govt

    అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

  • Iftar Ramadan

    Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

Latest News

  • అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!

  • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

  • Gold Price : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

  • రైతుగా మారిన.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

  • Gas Shortage : ఇండక్షన్ స్టవ్స్ వాడుతున్నారా? అయితే మీరు వీటిని గుర్తుపెట్టుకోవాల్సిందే !!

Trending News

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd