CM Revanth : కేటీఆర్ పిచ్చోడు – సీఎం రేవంత్
CM Revanth : రాష్ట్రంలో ప్రాజెక్టుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకంగా మారిందని ఆరోపించారు
- By Sudheer Published Date - 08:05 AM, Tue - 11 March 25

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)లను ఉద్దేశించి ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకంగా మారిందని ఆరోపించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్(AP)కు అనుకూలంగా వ్యవహరించినది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనని ఆరోపించారు. కేసీఆర్ గవర్నెన్స్ వల్ల తెలంగాణకు వచ్చిన నష్టాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
Skin Beauty Tips : చర్మం ఆరోగ్యంగా మెరిసిపోవాలంటే కొల్లాజెన్ తీసుకోవాల్సిందే
కేటీఆర్‌ను “పిచ్చోడు” అని సంబోధిస్తూ ఆయన గురించి మాట్లాడటం తన సమయ వృథా అని రేవంత్ అన్నారు. తాను గతంలో కాంగ్రెస్ నేతగా ఉండే సమయంలోనే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చానని గుర్తు చేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ నిజమైన అభివృద్ధి అంటే మాటలు కాకుండా పనుల్లో చూపాలని హితవు పలికారు. టీడీఆర్ వ్యవహారంపై కేటీఆర్ చేసిన ఆరోపణలకు కూడా సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. టీడీఆర్ షేర్ల కొనుగోలు వెనుక తమ అనుచరుల హస్తం ఉందన్న ఆరోపణలను ఖండించారు. హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ అక్రమాలు, అవినీతి లావాదేవీలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. తన పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తానని, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
Pregnancy : గర్భధారణ సమయంలో వాంతులు అవ్వడానికి కారణం ఏంటి..?
ఇదే సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై కూడా సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు నటిస్తున్నారని, కానీ వాస్తవానికి రాష్ట్రానికి తగిన నిధులు తీసుకురాలేకపోతున్నారని ఆరోపించారు. తెలంగాణలో మెట్రో ప్రాజెక్టును తాము తీసుకురావాలని కోరుకుంటున్నామని కానీ కిషన్ రెడ్డి అందులో ఎటువంటి భాగం పోషించలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలు తెలంగాణకు అనుకూలంగా లేవని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని రేవంత్ డిమాండ్ చేశారు.