HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Lokeshs Key Comments On The Coalition Governments One Year Rule

Minister Lokesh: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై మంత్రి లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు!

దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి.

  • Author : Gopichand Date : 12-06-2025 - 2:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Lokesh
Minister Lokesh

Minister Lokesh: సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) పేర్కొన్నారు. కూటమి పాలన ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తిచేసుకుంటున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. ఉద్యోగాల విషయంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు ప్రజా ప్రభుత్వం భర్తీ చేస్తోంది. డీఎస్సీని ఎట్టిపరిస్థితుల్లో ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారు 24 కేసులు వేసింది. ఈ రోజుతో 24వ కేసు కూడా సుప్రీంకోర్టులో డిస్మిస్ అయింది. అవన్నీ తట్టుకుని డీఎస్సీ ప్రక్రియను పూర్తిచేస్తున్నాం.

గడచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలో తీసుకువచ్చాం

గడచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్ మెంట్స్ లో ఏపీ భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఉంది. 16 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇందులో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్, రిలయన్స్ రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈ రోజు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలిగాం. రైల్వేజోన్ సాధించాం. అంతేకాకుండా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి.

Also Read: PAN-Aadhaar Card: పాన్-ఆధార్ కార్డు లింక్ చివరి తేదీ ఎప్పుడు? స్టెప్ బై స్టెప్ ప్రక్రియ ఇదే!

దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం

ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. వృద్ధులకు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు అందిస్తున్నాం. వికలాంగులకు రూ.3వేలు పెంచి రూ.6వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి ప్రతినెలా రూ.15వేలు అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా 203 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఆగష్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం కూడా అమలుచేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికే 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజా ప్రభుత్వం తెలుగింటి ఆడపడుచులకు అందించడం జరిగింది. గ్యాస్ పథకంలో సవరణలు తీసుకువచ్చి సదరు నగదును మహిళల బ్యాంక్ అకౌంట్లకే నేరుగా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

బాబు సూపర్ సిక్స్ లో తల్లికి వందనం హామీ నిలబెట్టుకున్నాం

ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం హామీ నిలబెట్టుకుంటున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలుచేస్తామని చెప్పాం. హామీ ఇచ్చిన విధంగా జీవో విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నగదు తల్లుల అకౌంట్లలో జమచేయడం జరుగుతుంది. రూ.13వేలు తల్లుల అకౌంట్లలో పడతాయి. రూ.2వేలు పాఠశాలల్లో మెయింటెన్స్ గ్రాంట్ కింద ఖర్చు చేయడం జరుగుతుంది. తల్లికి వందనం కింద దాదాపు 60శాతం కుటుంబాలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలు ఉన్నారు. వారికి ఇద్దరుంటే రూ.26వేలు, ముగ్గురుంటే రూ.39వేలు వస్తాయి. వారి అకౌంట్లలోనే నగదు జమచేయడం జరుగుతుంది. బాబు సూపర్ సిక్స్ లో మరొక హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడం జరిగింది.

సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి

దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మాండేట్ ఇచ్చారు. ఓ వైపు ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ.. ప్రజలు ఏ ఆశతో కూటమికి 94శాతం సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశలు నెరవేర్చే బాధ్యత మాపై ఉందన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • bjp
  • CM Chandrababu
  • Janasena
  • Minister Lokesh
  • nda govt
  • One-year rule
  • tdp

Related News

Vijayawada Durga Temple

Vijayawada Durga Temple: దుర్గ గుడి లో సిబ్బంది చేతివాటం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించి దొరికిపోయారు. హుండీ లెక్కింపులో భక్తులు సమర్పించిన బంగారాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. వీరు హుండీల్లోని అసలైన బంగారాన్ని రోల్డ్‌ గోల్డ్‌గా మార్చేందుకు ప్లాన్ చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. అప్పుడు వీరి ఘనకార్యం బయటపడింది. బాధ్యులైనవారికి ఆలయ ఈవో మెమో

  • Goods Train Derailment

    Train Derailment: నెల్లూరులో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్..

  • Lpg Gas Cylinder

    Gas cylinder: గ్యాస్ సిలిండర్ తేలేదని.. ఫినాయిల్ తాగిన భార్య..

  • Tdp 44

    TDP 44th Formation Day Celebrations : అట్టహాసంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

  • Cbn Jagan

    AP Capital : జగన్ ను ఊసరవెల్లితో పోల్చిన చంద్రబాబు

Latest News

  • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

  • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

  • ఐపీఎల్‌లో విషాదం.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ మృతి!

  • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

  • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd