Durga Temple : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో అధికారుల మధ్య సమన్వయలోపం.. మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్
ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్ని ఉత్సవాల్లో అధికారుల మధ్య సమన్వయలోపం బయటపడుతుంది. తొలిరోజు నుంచి
- Author : Prasad
Date : 22-10-2023 - 7:43 IST
Published By : Hashtagu Telugu Desk
ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్ని ఉత్సవాల్లో అధికారుల మధ్య సమన్వయలోపం బయటపడుతుంది. తొలిరోజు నుంచి పోలీసులు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల సమన్వయ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మొదటి రోజు అధికారులను హెచ్చరించిన వారి తీరు మారలేదు. తాజాగా మరోసారి మంత్రి కొట్టు సత్యనారాయణ పోలీసులు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనాలు, దర్శనాలు అంశాల విషయంలో అధికారుల అజమాయిషీ విషయమై మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్ అయ్యారు. వివక్ష లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీపీ, కలెక్టర్లకు ఆదేశాలను మంత్రి కొట్టు సత్యనారాయణ పంపిచారు. వీఐపీ మార్గం అంటే టికెట్టు లేకుండా వెళ్ళే మార్గం అయిపోయిందని.. వీఐపీ టికెట్టు దర్శనం పై కూడా ఒక నిర్ణయం తీసుకుంటానని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
మూత నక్షత్రం రోజులన 2 లక్షలు మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. కిందిస్ధాయి పోలీసు సిబ్బంది సమస్యలు కలిగిస్తున్నారని.. పోలీసులకు సంబంధించిన వారిని మాత్రమే దర్శనానికి పంపడం ఇబ్బందికరంగా మారిందన్నారు. పోలీసుల విషయమై ఒక నోట్ కూడా సీపీకి పంపిస్తున్నాని మంత్రి తెలిపారు. సమన్వయం తప్పిన అధికారుల విషయమై ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్, సీపీ లకు చెప్పినట్లు మంత్రి తెలిపారు. భక్తులకు సదుపాయాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని.. ఇప్పటి వరకూ 5.8 లక్షల మంది దర్శనం చేసుకున్నారని తెలిపారు. సోమవారం కూడా 2 లక్షలకు పైబడి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని.. ఎండోమెంట్ అధికారులు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు.