Bhuvaneswari : నారా భువనేశ్వరికి సంఘీభావం తెలిపిన ఎంపీ కేశినేని నాని సతీమణి పావని, కుమార్తె శ్వేత
టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని విజయవాడ ఎంపీ కేశేనేని నాని సతీమణి పావని, కుమార్తె శ్వేత
- By Prasad Published Date - 07:23 AM, Sun - 22 October 23

టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని విజయవాడ ఎంపీ కేశేనేని నాని సతీమణి పావని, కుమార్తె శ్వేత కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో రాజమండ్రిలోనే భువనేశ్వరి బస చేస్తున్నారు. భువనేశ్వరికి మద్దతుగా రాజమండ్రికి పెద్ద సంఖ్యలో అభిమానులు, టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సతీమణి పావని, కుమార్తె కేశినేని శ్వేతలు భువనేశ్వరిని కలిసి భరోసా ఇచ్చారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నేతపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని కేశినేని శ్వేత అన్నారు.73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుని అక్రమంగా జైల్లో పెట్టి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా వేల మందికి ఉపాధి కల్పించినందుకు ప్రభుత్వం ఆయన్ని జైల్లో పెట్టించిందని.. అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన తప్పుగా ఈ ప్రభుత్వం నిరూపిస్తుందన్నారు. ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణ చూడలేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కుట్రలు పన్నిందని ఆరోపించారు.