Durga Temple : దుర్గుగుడి అధికారులపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం.. ఏర్పాట్లపై అసంతృప్తి
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసర ఉత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం
- By Prasad Published Date - 07:08 AM, Tue - 17 October 23

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసర ఉత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో పోలీస్, దేవాదాయ శాఖ అధికారులు విఫలమైయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం దసర ఉత్సవాలు ప్రారంభమైయ్యారు. నేడు మూడవ రోజుకు దసర శరన్నవరాత్రి ఉత్సవాలు చేరుకున్నాయి. మూడు రోజులు గడిచిన ఆలయంలో ఏర్పాట్లను సరి చేయలేదని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా ఉత్సవాల తొలిరోజుతో పోలిస్తే రెండోరోజు నిన్న (సోమవారం) భక్తుల రద్దీ తగ్గింది. దాదాపు 40 వేల మంది భక్తులు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తొలి రోజు ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. అయితే రద్దీ తక్కువగా ఉండడంతో సోమవారం ఒక్క గంటలోపే భక్తులకు దర్శనం లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికులు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన శ్రీ కనకదుర్గాదేవిని పూజించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటు ఆలయంలో ఏర్పాట్లపై భక్తులు మండిపడుతున్నారు. పోలీస్ సిబ్బంది తమకు సంబంధించిన వ్యక్తులను నేరుగా అమ్మవారి దర్శనానికి పంపిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది పోలీసులు ఇదే తంతు కొనసాగిస్తున్నారు. ఈ విషయం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి వెళ్లగా ఆయన పోలీస్ అధికారులన్ని నిలదీశారు. ఇటు పోలీసు సిబ్బంది తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని దేవాదాయ శాఖ అధికారులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో, పోలీసు కమిషనర్ ఎండోమెంట్స్ అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించారు.
Also Read: Chandrababu – ACB Court : చంద్రబాబు హెల్త్ బులెటిన్ పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ