Chandrababu – ACB Court : చంద్రబాబు హెల్త్ బులెటిన్ పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ
Chandrababu - ACB Court : చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయడం లేదంటూ ఆయన తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
- By Pasha Published Date - 07:06 AM, Tue - 17 October 23

Chandrababu – ACB Court : చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయడం లేదంటూ ఆయన తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు(మంగళవారం) ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. తమకు ఎప్పటికప్పుడు చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ను ఇవ్వాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు ఈ పిటిషన్ వేశారు. హెల్త్ బులెటిన్లను ఇవ్వడానికి సంబంధిత అధికారులు నిరాకరించారని ఈ పిటిషన్‌లో ఆరోపించారు. సోమవారం రోజు ఈ పిటిషన్ ను పరిశీలించిన ఏసీబీ కోర్టు జడ్జి.. ‘‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రిపోర్ట్స్ ను మెయిల్‌లో పంపామని అధికారులు చెబుతున్నారు. ఫిజికల్ కాపీ అందగానే ఇస్తామని అంటున్నారు’’ అని చంద్రబాబు లాయర్లకు చెప్పారు. దీనిపై లాయర్లు స్పందిస్తూ.. ‘‘ చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు మా క్లయింట్ కు నివేదిక ఇవ్వలేదు. ఈ నెల 12న వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జైలు అధికారులు మాకు ఎలాంటి రిపోర్ట్ లను ఇవ్వలేదు. అధికారులు చెప్పిన అంశాలతోనే రిపోర్ట్ ఇస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది’’ అని కోర్టుకు తెలిపారు. ఇవాళ ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు(Chandrababu – ACB Court) విచారణ చేపట్టనుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక చంద్రబాబు శరీరం రంగు మారిందని, చర్మంపై దద్దుర్లు, అలెర్జీ వచ్చినట్లు రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ తో కలకలం రేగింది. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని అందులో సూచించారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందంటూ ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యులు ఎప్పటికప్పుడు బాబుకు టెస్ట్‌లు చేస్తున్నారని, మెడిసిన్స్ కూడా సిఫార్సు చేస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు ఏసీ కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.