HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Midnight Arrests During The Reign Of Darkness

Midnight Arrests: చీకటి పాలనలో అర్ధరాత్రి అరెస్టులు..!

ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు (Arrests)తో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కి చంద్రబాబు నంద్యాలలో క్యాంప్ చేసి ఉన్నారు.

  • Author : Hashtag U Date : 09-09-2023 - 10:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arrests
Chandrababu came out of the bus

By: డా.ప్రసాదమూర్తి

Midnight Arrests: ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు (Arrests)తో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కి చంద్రబాబు నంద్యాలలో క్యాంప్ చేసి ఉన్నారు. ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతుందని పలు వార్తలు నిన్నటి నుంచి ఊపందుకున్నాయి. కారణాలు మాత్రం రకరకాలుగా వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలు, ఊహాగానాలు నిజమేనని చంద్రబాబుని శనివారం తెల్లవారుజామున అరెస్టు చేయించి అధికార వైసిపి నేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుజువు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లో పెద్ద కుంభకోణం జరిగిందని, వేలకోట్ల లావాదేవీలు జరిగాయని, డిజైన్ టెక్ కంపెనీ లాంటి అనేక షెల్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున ధనం తరలింపు జరిగిందని, చంద్రబాబు మీద ఆరోపిస్తున్నారు.

ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలు, ప్రతిదూషణలు, విమర్శలు, ప్రతివిమర్శలు రాజకీయాలలో సాధారణమే. అధికారంలో ఉన్నవారు అధికారాన్ని కాపాడుకోవడానికి, ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలోకి రావడానికి ఎవరి రాజకీయాలు వారు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని రకాల హక్కులూ ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నైతిక విలువలను దృష్టిలో ఉంచుకొని, రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించడమే వారి వారి వ్యక్తిత్వాలకు నిదర్శనం అవుతుంది.

అయితే చీకట్లో, 70 సంవత్సరాలు పైబడిన ఒక వృద్ధ ప్రతిపక్ష నేత దగ్గరకు వెళ్లడం, ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అరెస్టు చేయడం అధికారంలో ఉన్న నాయకులకు సముచితమే అనిపించవచ్చు. కాని అదంతా కళ్లారా చూస్తున్న ప్రపంచానికి మాత్రం సంపూర్ణంగా అనైతిక అనుచిత ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగానే కనిపిస్తుంది. అరెస్టు చేసిన టైమింగ్ కీలకం. కుంభకోణం జరిగితే దానిమీద ఏం విచారణ జరిగింది, ఏ వాదోపవాదాలు జరిగాయి. ఏ ఆధారాల మీద దర్యాప్తులు సాగించారు, కేసు కొనసాగిన విధివిధానాలు ఏమిటి అనే విషయాలు ఆలోచనకు వస్తాయి. ఏ విచారణలు కొనసాగినా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా నిద్రలో లేపి బేడీలు వేసి పట్టుకుపోవడం ఏమాత్రం సమర్ధనీయం కాదని చంద్రబాబు న్యాయవాదులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వాదిస్తున్నారు. ప్రజాస్వామిక విలువల పట్ల నమ్మకం ఉన్నవారు జగన్మోహన్ చేసిన ఈ పని నియంతృత్వానికి పరాకాష్ట అని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: Chandrababu: 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశాను: చంద్రబాబు

తెల్లవారితే శనివారం సెకండ్ సాటర్ డే. ఆ తరువాత ఆదివారం. రెండు రోజులు కోర్టులు ఉండవు. మేజిస్ట్రేట్ ముందు హాజరపరచడానికి జడ్జి గారు కూడా అందుబాటులో లేరని చెబుతున్నారు. అంటే కనీసం రెండు రోజులైనా చంద్రబాబును పోలీసుల కస్టడీలో ఉంచి తమ కక్ష తీర్చుకోవాలని అధికార పార్టీ ఆత్రపడుతున్నట్టుగా కనిపిస్తోంది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ అనుభవజ్ఞుడు, 70 సంవత్సరాలు పైబడిన నాయకుడు అయిన చంద్రబాబు నాయుడుని, చూడండి.. మేము కాబట్టి బందీ చేశాం అని అధికార పార్టీ చంకలు గుద్దుకోవచ్చు. ఇది ఆ పార్టీ అల్ప రాజకీయాలకు, చౌకబారు ధోరణికి అర్థం పడుతుంది. కానీ చుట్టూ ఇదంతా గమనిస్తున్న ప్రజలకు దీని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలు మాత్రం తప్పనిసరిగా బోధపడతాయి.

అధికారంలోకి వచ్చింది మొదలు ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆయన అనుచర గణం అందరూ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీద దాడులు చేయడానికి ఎలాంటి చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. రాజకీయంగా దాడులు చేయడం వేరు భౌతికమైన దాడులు వేరు. అరెస్టులు, గృహ నిర్బంధాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు నిత్యకృత్యాలుగా మారిపోయాయి. జనం ఖాతాల్లో డబ్బులు వేయడం తప్ప ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది ఏ రంగంలోనూ ఒక్క అడుగు ముందుకైనా పడలేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పోలవరం విషయం గాని రాజధాని విషయం గాని ఏపీ ప్రత్యేక హోదా విషయం గానీ ఇలా అనేకానేక కీలక సమస్యలు పరిష్కారం కాలేదు. రోడ్లు వేయడం దగ్గర నుంచి రాజధాని నిర్మాణం దాకా ఏ చిన్న పనీ జరగలేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నిష్ఫల పరిపాలనను తీవ్రంగా విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న రోడ్ షోలు, నిర్వహిస్తున్న బహిరంగ సభలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ఒకపక్క న్యాయస్థానాల నుంచి కూడా జగన్ సర్కారుకు ఏ విషయంలోనూ ఆమోదముద్ర లభించడం లేదు. కనుకనే జగన్ ఒక రకమైన పొలిటికల్ డిప్రెషన్ కి గురై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు అర్ధరాత్రి అరెస్టు కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న చీకటి పాలనకు చంద్రబాబు అర్ధరాత్రి అరెస్టు అద్దం పడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • Arrests
  • Chandrababu Arrest
  • cm jagan
  • Midnight Arrests
  • tdp
  • ysrcp

Related News

Unnam Hanumantharaya Chowdh

Kalyandurgam : TDP మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, అనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు

  • Heritage

    హెరిటేజ్‌కు రాయితీలు.. నిబంధనల ప్రకారమే ప్రోత్సాహకాలు!!

  • TDP MP Putta Mahesh Kumar Drugs Case

    ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్

Latest News

  • ఐపీఎల్ 2026.. ఉచితంగా మ్యాచ్‌లు చూసేందుకు సిద్ధమవ్వండి!

  • Madhira: మధిర కోల్డ్‌ స్టోరేజ్‌లో రెండో ఛాంబర్‌కు వ్యాపించిన మంటలు

  • Roja: తమిళ సాంగ్‌లో మాస్ స్టెప్పులతో అదరగొట్టిన రోజా!

  • Putta Sudhakar Yadav: నా కొడుకు మహేష్ కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్

  • Income Tax: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుంది.

Trending News

    • Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. పడిపోతున్న బంగారం ధరలు

    • మ‌రోసారి లాక్ డౌన్ త‌ప్ప‌దా?!

    • భారీగా పెర‌గ‌నున్న ఉద్యోగుల జీతాలు?!

    • ఎల్‌పీజీపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • Mumbai: ముంబై బీచ్‌లో వింత బిజినెస్.. చిన్న బాధలైతే రూ.250.. వెయ్యిస్తే కలిసి ఏడుస్తా..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd