Mega politics : `మెగా` డబుల్ గేమ్! `వాల్తేరు వీరయ్య`కు ఏపీ పొలిటికల్ సెగ
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల డబుల్ గేమ్ (Mega politics)ఆడుతున్నారు. ఏపీ రాజకీయాలతో తనకేం పనంటూ చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది.
- Author : CS Rao
Date : 12-01-2023 - 1:20 IST
Published By : Hashtagu Telugu Desk
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ డబుల్ గేమ్ (Mega politics)ఆడుతున్నారు. ఏపీ రాజకీయాలతో తనకేం పనంటూ ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, తెలంగాణలో ఉంటోన్న తనకు ఏపీతో నాకేం సంబంధం అంటూ ఆయన చేసిన కామెంట్ `వాల్తేరు వీరయ్య` (waltheru veeraiah)కు తలనొప్పిగా మారింది. మూడు రాజధానులకు మద్ధతు పలికిన చిరంజీవి(Mega politics) ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నడుచుకుంటున్నారు. అంతేకాదు, వాల్తేరు వీరయ్య(waltheru veeraiah) ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విశాఖ పౌరునిగా ఉంటానని ప్రకటించారు. వైజాగ్ రాజధానికి పరోక్షంగా జై కొట్టారు. దీంతో ఆయన నటించిన సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి అమరావతిని రాజధాని కోరుకుంటోన్న వాళ్లు వైరల్ చేస్తున్నారు.
`వాల్తేరు వీరయ్య` కు తలనొప్పి (Mega politics)
ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ కానంటూ మెగా స్టార్ చిరంజీవి తాజాగా కుండబద్దలు కొట్టారు. దీంతో ఇప్పటివరకు ఆయనపై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్టేనని మెగా అభిమానులు భావిస్తున్నారు. తమ్ముడు పవన్ ను సీఎంగా చూడాలని ఇటీవల చిరంజీవి అభిలషించారు. అంతేకాదు, అవసరమైనప్పుడు పవన్ కు మద్ధతు పలుకుతానంటూ ఆ మధ్య ప్రకటించారు. దీంతో ఏపీ రాజకీయాల్లోకి చిరంజీవి( Mega politics) మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, వాల్తేరు వీరయ్య సినిమా విడుదల సందర్భంగా జరుగుతోన్న నష్టాన్ని పూడ్చుకోవడానికి చిరంజీవి జాగ్రత్త పడ్డారు. ఏపీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదంటూ తాజాగా ప్రకటించడం విచిత్రం.
Also Read : Megastar Chiranjeevi: రాజకీయాలపై చిరంజీవి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కల్యాణ్, నాగబాబు రాజకీయ దూకుడు పెంచారు. మెగా బ్రదర్స్ కు రాజకీయ భవిష్యత్తు లేదంటూ ఏపీ మంత్రి రోజా ఇటీవల తెగేసి చెప్పిన విషయం విదితమే. ఆమె వ్యాఖ్యలపైనా చిరంజీవి స్పందిస్తూ ఏ కారణంతో చేశారనే విషయం తెలియదన్నారు. మంత్రి అయ్యాక రోజా తమ ఇంటికి కూడా వచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏపీతో సంబంధం లేదని చిరంజీవి చెప్పడం హాట్ టాపిక్ అయింది.
ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి
ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి మెగా ఫ్యామిలీని హోల్ సేల్ గా 2009 ఎన్నికల్లోకి దింపారు. ప్రత్యేక రైలు ద్వారా మెగా హీరోలు అందరూ కలిసి ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో 18 మంది ఎమ్మెల్యేలను ఏపీలో గెలుచుకున్నారు. ఆ తరువాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అందరికీ తెలిసిందే. అందుకు బహుమానంగా కేంద్ర మంత్రి పదవిని చిరంజీవి తీసుకున్నారు. రాష్ట్రం విడిపోయే వరకు ఆ పదవిని ఎంజాయ్ చేశారు. ఆ తరువాత ఏపీలో చెల్లని రూపాయిలాగా రాజకీయాల్లో చిరంజీవి మిగిలారు. వెంటనే సినిమా ఇండస్ట్రీ వైపు మళ్లారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. అలాగని ఏదైనా పార్టీలో చేరతారా? అంటే కొన్ని రోజులు బీజేపీ మరికొన్ని రోజులు జనసేన లోకి వెళుతున్నారని ప్రచారం జరిగింది.
గాడ్ ఫాదర్ విడుదల సందర్భంగా…
ఇటీవల ఆయన సినిమా గాడ్ ఫాదర్ విడుదల సందర్భంగా `రాజకీయాలను నేను వదిలి పెట్టాను, రాజకీయాలు నన్ను వదల్లేదు` అంటూ ఒక వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో విడుదల చేయడం ద్వారా రాజకీయ చర్చల్లోకి వచ్చారు. ఆ సినిమా సందర్భంగా నిర్వహించిన పలు ఫంక్షన్లలో జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. సీఎం అయ్యే సత్తా ఉన్న లీడర్ పవన్ అంటూ కితాబు ఇచ్చారు. అవసరమైనప్పుడు తమ్ముడికి మద్ధతు ఇస్తానని ప్రకటించారు. దీంతో జనసేన పార్టీ తరపున 2024 ఎన్నికల బరిలోకి దిగుతారని న్యూస్ ఫోకస్ అయింది. అల్లూరు సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మోడీ ఇచ్చిన ప్రత్యేక ఆలింగనం వెనుక బీజేపీలోకి వెళ్లి రాజ్యసభ ఎంపీగా చిరంజీవి వెళబోతున్నారని ప్రచారం జరిగింది. సినిమా టిక్కెట్ల, ఆన్ లైన్ విధానంపై మాట్లాడేందుకు ప్రత్యేక విమానంలో రెండుసార్లు జగన్మోహన్ రెడ్డిని కలిసిన చిరంజీవి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని ఆనాడు టాక్ నడిచింది.
Also Read : Veera Simha Reddy Review: బాలయ్య ‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ రివ్యూ!
తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా వైజాగ్ గురించి మాట్లాడారు. అక్కడే స్థిరపడతానని ప్రకటించారు. విశాఖ పౌరునిగా ఉండిపోతానని వెల్లడించారు. పరోక్షంగా వైజాగ్ రాజధానిగా ఉండాలని ఆకాంక్షించారు. దీంతో ఆగ్రహించిన ఏపీలోని ఒక వర్గం ప్రేక్షకులు `వాల్తేరు వీరయ్య`సినిమాను బహిష్కరించాలని సోషల్ మీడియా వేదికగా డ్రైవ్ చేస్తున్నారు. దానికి క్లారిటీ ఇచ్చే క్రమంలో వ్యూహాత్మకంగా ఒక ప్రైవేటు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఏపీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. దీంతో ఏపీలోని ప్రేక్షకులు చిరంజీవి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. సినిమా కలెక్షన్లు మాత్రం ఏపీ నుంచి కావాలి. ఏపీ పరిస్థితులపై మాత్రం ఎలాంటి సంబంధంలేదని ఆయన వ్యాఖ్యానించడాన్ని సగటు ప్రేక్షకుడు ప్రశ్నించకుండా ఉండలేకపోతున్నాడు. ఇలాంటి పరిణామాల మధ్య ఈనెల 13వ తేదీన విడుదల కానున్న `వాల్తేరు వీరయ్య` (Waltheru veeriah)సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.