Richest MP In India: భారతదేశంలో అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తి..! ఆస్తి ఎంతంటే..?
ఎన్నికల తరుణంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేత సంచలనం సృష్టంచారు.
- By Gopichand Published Date - 12:46 AM, Tue - 23 April 24

Richest MP In India: ఎన్నికల తరుణంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన ఎంపీ (Richest MP In India) అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేత సంచలనం సృష్టంచారు. ఆయన ఎన్నికల నామినేషన్ సందర్భంగా అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు చూసి సొంత పార్టీ కార్యకర్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. గుంటూరు నుంచి ఎంపీ రేసులో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌పై ఇక్కడ చర్చ జరుగుతోంది. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన ఆయన తన కుటుంబ ఆస్తుల విలువ దాదాపు రూ.5785 కోట్లుగా ప్రకటించారు.
పెమ్మసాని కోట్ చేసిన సంఖ్యలు క్రింది విధంగా ఉన్నాయి
చరాస్తులు- రూ. 5598,64,80,786 (రూ. 5598.65 CR)
స్థిరాస్తులు- రూ. 186,62,93,157 (రూ. 186.63 CR)
అప్పులు- రూ. 1038,00,00,000 (రూ. 1038 CR)
Also Read: LS Polls: తెలంగాణ ఎన్నికల రంగంలోకి డీకే.. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై తేల్చివేత!
ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఆయన కుటుంబానికి సంబంధించిన మొత్తం ఆస్తి రూ. 5785. 28 కోట్లు కాగా స్థిరాస్తులు రూ. 186.63 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయనకు రూ. 1038 కోట్ల అప్పు ఉన్నట్లు కూడా తెలిపారు. అయితే గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో పెమ్మసాని చంద్రశేఖర్‌ని టీడీపీ గుంటూరు అభ్యర్థిగా ఫైనల్ చేసింది.
పెమ్మసాని చంద్ర శేఖర్ ఎన్నారై వైద్య నిపుణుడు. ఈ ఏడాది ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాల కోసం తన సొంత డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడనని ఆయన పలు సందర్భాల్లో ప్రకటించారు. అయితే పెమ్మసాని అఫిడవిట్ చూశాక దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థి అని ఓటర్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. ఏపీలో కూడా 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తారు.
We’re now on WhatsApp : Click to Join