TDP : టీడీపీలో చేరిన మేయర్ దంపతులు
ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరారు.
- By Latha Suma Published Date - 06:32 PM, Tue - 27 August 24

TDP: ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో.. ఏలూరుకు చెందిన మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎం.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరారు. వీరికి ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ మాత్రం ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని, ప్రభుత్వంపై మాత్రం ప్రతిరోజు దుష్ప్రచారానికి పాల్పడుతుందని మండిపడ్డారు. అయితే తమ ప్రభుత్వం, ఎన్నికలలో ప్రకటించిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తంది” అని లోకేష్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
అనంతరం, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. నియోజక అభివృద్ధి కోసం వచ్చేవారందరికీ తమ పార్టీ స్నేహ హస్తంఅందిస్తుందని, త్వరలోనే దశల వారిగా కార్పొరేటర్లు టీడీపీలో చేరబోతున్నారని అన్నారు. కాగా ఆళ్ల నాని వైసీపీ కార్యకర్తలను వదిలేసి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు అని తెలిపారు. తర్వాత ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ.. కొన్ని పరిస్థితుల్లో టీడీపీని వదిలి వైసీపీకి వెళ్లాల్సి వచ్చిందని, కానీ ఆ పార్టీలోకి వెళ్లాక నియోజక వర్గంలో ఏ మాత్రం అభివృద్ధిని కూడా చేయలేకపోయామని తెలిపారు. అయితే త్వరలోనే 40 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరబోతున్నారు అని మేయర్ షేక్ నూర్జహాన్ వెల్లడించారు.
కాగా, గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారని మంత్రి నారా లోకేశ్ గుర్తుచేశారు. అయినప్పటికీ ఆ పార్టీకి గుణపాఠం రాలేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఏలూరు అభివృద్ధి కోసం కలిసి వచ్చేవారికి స్నేహ హస్తం అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయ పడ్డారు. వైసీపీ కార్యకర్తలను వదిలేసి, పార్టీకి రాజీనామా చేసి ఆళ్ల నాని వెళ్లిపోయారని గుర్తుచేశారు. ఏలూరు అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. దశల వారీగా కార్పొరేటర్లు టీడీపీ లో చేరబోతున్నారని వివరించారు.
Read Also: BJP : కోల్‌కతా హత్యాచార ఘటన..12 గంటల బంద్‌కు బీజేపీ పిలుపు