International Women’s Day : ఇకపై ఎంత మంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు : సీఎం చంద్రబాబు
అధిక సంతానం వద్దని గతంలో నేనే చెప్పాను. దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలను కనాలని చెబుతున్నాను. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరి వరకే ప్రసూతి సెలవులు ఉన్నాయి.
- By Latha Suma Published Date - 03:56 PM, Sat - 8 March 25

International Women’s Day : ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం తెలిపారు. వీటితోపాటు ఇతర ప్రయోజనాలనూ కల్పిస్తాం. అధిక సంతానం వద్దని గతంలో నేనే చెప్పాను. దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలను కనాలని చెబుతున్నాను. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరి వరకే ప్రసూతి సెలవులు ఉన్నాయి. ఇకపై ఎంత మంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
Read Also: Lalit Modi : వనౌతులో సెటిల్ కానున్న లలిత్ మోడీ.. ఆ దేశం విశేషాలివీ
సంతానం కనకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. ఉత్తర భారతంలో ఒక్కొక్కరు ముగ్గురు సంతానం కలిగి ఉంటారు. దక్షిణభారతదేశంలో తక్కువ మంది సంతానాన్ని కంటున్నారు. దక్షిణ భారతదేశంలో కొందరు సంతానం కనడానికి అసలు ఇష్టపడలేదు. నేను రాజకీయాల్లో ఉండటం డబ్బు సంపాదించలేకపోయాను. భువనేశ్వరి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు నాకు కూడా డబ్బులిచ్చే స్థాయికి భువనేశ్వరి ఎదిగారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహిళలు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే బాధ్యత నాది. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఆడవారికి కండక్టర్ ఉద్యోగాలు ఇచ్చాం. స్త్రీలు ముందుకొస్తే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా అవుతారు. ఈ ఏడాదిలో లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేస్తాం.
ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా నారీమణులు ఎదగాలన్నారు. అంతకముందు సీఎం స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. బృందాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని సీఎం ధరించారు. పోలీసు శాఖ రూపొందించిన శక్తి యాప్‌ను చంద్రబాబు ప్రారంభించారు. చేనేత రథాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా ర్యాపిడో డ్రైవర్లను చంద్రబాబు అభినందించారు. గుర్రపుడెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా ఆదాయం లభిస్తుందని సీఎం తెలిపారు. దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆడవారు తయారు చేసిన ఉత్పత్తులకు నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలని చెప్పారు. అనంతరం ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు.