HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Massive Drdo Aircraft Manufacturing Project Worth Rs15000 Crore In Ap

DRDO: ఏపీలో రూ.15,000 కోట్లతో డీఆర్‌డీవో ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ భారీ ప్రాజెక్ట్

  • Author : Vamsi Chowdary Korata Date : 02-05-2026 - 2:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
DRDO Aircraft Manufacturing Center in Andhra Pradesh
DRDO Aircraft Manufacturing Center in Andhra Pradesh

ఏపీలో ఏరోస్పేస్, రక్షణ రంగం పరుగులు పెట్టనుంది. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏకంగా రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్‌డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ముందుకు వచ్చింది. ఈ నెల 15న సీఎం చంద్రబాబు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు రాకతో శ్రీసత్యసాయి జిల్లా దేశ రక్షణ రంగ పటంలో కీలక స్థానాన్ని సంపాదించనుంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) మోడల్ యుద్ధ విమానాలను తయారు చేయనున్నారు. దేశీయంగా, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించే ఈ విమానాలను భారత వైమానిక దళం, నౌకాదళం కోసం వినియోగిస్తారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న సుఖోయ్ ఎస్‌యూ-30 యుద్ధ విమానాలకు ప్రత్యామ్నాయంగా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 600 ఎకరాల భూమిని డీఆర్‌డీవోకు కేటాయించింది. భవిష్యత్ అవసరాల కోసం మరో 400 ఎకరాలను కూడా అందుబాటులో ఉంచింది. నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసి, 2029 నాటికి మొదటి నమూనాను సిద్ధం చేయాలని, 2035 నాటికి పూర్తిస్థాయిలో విమానాల ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఏరోస్పేస్ హబ్‌గా శ్రీసత్యసాయి జిల్లా
ఈ ఒక్క ప్రాజెక్టుతోనే కాకుండా శ్రీసత్యసాయి జిల్లా క్రమంగా ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే పాలసముద్రం వద్ద రూ.500 కోట్ల పెట్టుబడితో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్‌) వెయ్యి ఎకరాల్లో డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తోంది. అలాగే మడకశిరలో కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.2,500 కోట్ల వ్యయంతో వెయ్యి ఎకరాల్లో డిఫెన్స్ ఎనర్జిటిక్స్ తయారీ కాంప్లెక్స్‌ను నిర్మించనుంది. ఇప్పుడు డీఆర్‌డీవో ప్రాజెక్టు కూడా తోడవడంతో జిల్లా పారిశ్రామిక స్వరూపం పూర్తిగా మారిపోనుంది.

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉండటం పరిశ్రమల ఏర్పాటుకు కలిసివస్తోంది. బెంగళూరు చుట్టుపక్కల రక్షణ రంగ విస్తరణకు అవకాశాలు తగ్గడంతో కంపెనీలన్నీ శ్రీసత్యసాయి జిల్లా వైపు చూస్తున్నాయి. జిల్లాలోని పుట్టపర్తిలో విమానాశ్రయం అందుబాటులో ఉండటం కూడా ఈ ప్రాజెక్టులకు అదనపు బలంగా మారింది. ఈ పరిణామాలతో రానున్న రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాంతానికి రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aerospace hubs
  • AMCA
  • andhra pradesh
  • Defense Research and Development Organisation
  • Defense Systems Integration Complex
  • DRDO
  • Puttaparthi
  • Sri Sathya Sai District
  • Stealth Fighter Jet

Related News

Apollo Hospitals' Dr. Preetha Reddy Meets CM Chandrababu

Cm Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ డాక్టర్ ప్రీతారెడ్డి భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆమె చంద్రబాబు నాయకత్వం, దార్శనికతపై ప్రశంసలు కురిపించారు. సమ్మిళిత అభివృద్ధి, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి పట్ల సీఎంకు ఉన్న అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు ప్రీతారెడ్డి తెలిపారు

  • Religious Organizations Brought Under the Ambit of the RTI Act

    Andhra Pradesh: ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..

  • Thalliki Vandanam

    Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై అప్‌డేట్..

  • Fight in the Middle of the Road Over a Girl

    Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్

  • Another massive investment in AP.

    AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..

Latest News

  • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

  • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

  • Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

  • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

Trending News

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd