Abhay : వేణుగోపాల్ పై మావోయిస్టు పార్టీ చర్యలు
Abhay : వేణుగోపాల్ (Venugopal) అసలు వ్యక్తిత్వం మల్లోజుల కుటుంబంతో ముడిపడి ఉంది. ఆయన మావోయిస్టు అగ్రనేతగా పేరొందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌కి తమ్ముడు. కిషన్ అనేక ఏళ్ల పాటు మావోయిస్టు పోరాటానికి అగ్రభాగాన నిలిచారు
- By Sudheer Published Date - 12:45 PM, Tue - 23 September 25

కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని ఇటీవల ‘అభయ్’ (Abhay ) పేరుతో పిలుపునిచ్చిన మల్లోజుల వేణుగోపాల్‌పై మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్రంగా స్పందించింది. ఆయన్ను ‘ద్రోహి’గా అభివర్ణిస్తూ, వెంటనే తన వద్ద ఉన్న ఆయుధాలను పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. లేని పక్షంలో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ ఆయుధాలను స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. ఈ ప్రకటనతో మావోయిస్టు వర్గాల్లో కలకలం రేగింది.
వేణుగోపాల్ (Venugopal) అసలు వ్యక్తిత్వం మల్లోజుల కుటుంబంతో ముడిపడి ఉంది. ఆయన మావోయిస్టు అగ్రనేతగా పేరొందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌కి తమ్ముడు. కిషన్ అనేక ఏళ్ల పాటు మావోయిస్టు పోరాటానికి అగ్రభాగాన నిలిచారు. ఇటీవల కిషన్ భార్య సుజాతక్క పోలీసుల వద్ద లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో వేణుగోపాల్ శాంతి చర్చలకు సిద్ధమని చెప్పడం, మావోయిస్టు కేంద్ర కమిటీని మరింత ఆగ్రహానికి గురిచేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Shreyas Iyer : ఇండియా A జట్టునుంచి శ్రేయాస్ అయ్యర్ అవుట్
ఈ సంఘటన మావోయిస్టు ఉద్యమంలో వర్గపోరాటం, విభజనల వాస్తవాన్ని మరింత బహిర్గతం చేసింది. ఒకవైపు కొంతమంది లొంగిపోతూ ప్రభుత్వ సహకారంతో కొత్త జీవితం ఆరంభించేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు కఠినవాదులు మాత్రం ఆయుధ పోరాటానికే కట్టుబడి ఉన్నారు. వేణుగోపాల్‌పై వచ్చిన ఈ హెచ్చరిక మావోయిస్టు వర్గాల్లో భవిష్యత్తులో మరిన్ని అంతర్గత విభేదాలకు దారితీయవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో శాంతి చర్చలకు ఆసక్తి చూపే ఇతర మావోయిస్టులకు కూడా ఈ హెచ్చరిక భయాందోళన కలిగించే అవకాశం ఉంది.