HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mandali Buddha Prasad Into Janasena Party

Avanigadda Janasena Candidate : జనసేన లోకి మండలి బుద్ధప్రసాద్..?

అవనిగడ్డ స్థానం జనసేన కు వెళ్లడం తో అక్కడ ఎవర్ని బరిలోకి దించుతుందా అనే ఆసక్తి నెలకొంది. జనసేన పార్టీ ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేరుతో సర్వేలు చేయించింది.. కానీ వారికీ ప్రజల నుండి పెద్దగా మద్దతు రాలేదు

  • Author : Sudheer Date : 01-04-2024 - 9:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mandali Buddha Prasad Into
Mandali Buddha Prasad Into

అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్ధప్రసాద్ (Mandali Buddha Prasad) జనసేన (Janasena)లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు పవన్ కళ్యాణ్ ను కలిసి, పార్టీ మారబోతున్నట్లు సమాచారం. ఏపీలో ఎన్నికల హోరాహోరీ మొదలైంది. అధికార పార్టీ ఇప్పటీకే 175 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను , 25 స్థానాలకు గాను ఎంపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టగా..ఈసారి బిజెపి , టిడిపి , జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి బరిలోకి దిగబోతున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపిక అనేది తలకుమించిన భారంగా మారింది. ముఖ్యంగా టిడిపి , జనసేన పార్టీలు కీలక నేతలకు టికెట్స్ ఇచ్చుకుపోలేని పరిస్థితి వచ్చింది. దీంతో చాలామంది నేతలు టికెట్ రాకపోవడం తో పార్టీని వీడుతుండగా..మరికొంతమంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అవనిగడ్డ (Avanigadda ) స్థానం జనసేన కు వెళ్లడం తో అక్కడ ఎవర్ని బరిలోకి దించుతుందా అనే ఆసక్తి నెలకొంది. జనసేన పార్టీ ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేరుతో సర్వేలు చేయించింది.. కానీ వారికీ ప్రజల నుండి పెద్దగా మద్దతు రాలేదు. దీంతో ఎవర్ని నిలపెడతామని ఆలోచనలో ఉంది. ఇదే క్రమంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌..జనసేన లో చేరి, అవనిగడ్డ టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇదే విషయమై పార్టీల అధినేతలతో సంప్రదింపులు చేసినట్లు తెలుస్తుంది. ఈరోజు బుద్ధప్రసాద్‌..పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను కలిసి పార్టీ కండువా కప్పబోతున్నట్లు వినికిడి. 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయనకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. దాంతో జనసేన అధినేత పవన్ కూడా బుద్ధప్రసాద్‌ ను పార్టీలోకి చేర్చుకొని..అవనిగడ్డ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారట. మరి బుద్ధప్రసాద్‌ కు టికెట్ ఇస్తే..ఈ టికెట్ కోసం ఎదురుచూస్తున్న జనసేన నేతలు ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం ఆర్‌కే మెస్‌ అధినేత బండి రామకృష్ణ, న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావు, సీనియర్‌ రాజకీయవేత్త బచ్చు వెంకటనాథ్‌ తదితరులు అసమ్మతి వ్యక్తం చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Read Also : Telangana: జహీరాబాద్‌లో 70 కిలోల గంజాయి స్వాధీనం, నలుగురి అరెస్ట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Avanigadda Janasena Candidate
  • Janasena
  • Mandali Buddha Prasad
  • Pawan Kalyan
  • tdp

Related News

NRI TDP

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

  • AP DSC : స్పోర్ట్స్ కోటా నియామకాలపై బహిరంగ చర్చకు సిద్ధం: SAAP చైర్మన్

  • Rahul Gandhi: సీబీఎస్‌ఈపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

  • TTD Admissions 2026: టీటీడీ సంగీత, నృత్య అడ్మిషన్లు దరఖాస్తులకు ఆహ్వానం

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd