HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Madanapalle File Burning Case Is Peddireddys Arrest Imminent

మదనపల్లె ఫైళ్ల దహనం కేసు…. ఇక పెద్దిరెడ్డి అరెస్ట్‌…??

  • Author : Vamsi Chowdary Korata Date : 20-03-2026 - 11:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Madanapalle Files Burn Case
Madanapalle Files Burn Case

Madanapalle Files Burnt Case ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి PA ముని తుకారాం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిలను CID అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు.

విదేశాల నుంచి తిరిగొస్తున్న నిందితుల కదలికలపై నిఘా ఉంచిన CID బృందం, తిరుపతి సమీపంలోని పనపాకం టోల్‌గేట్ దగ్గర ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. పెద్దిరెడ్డికి కుడిభుజాలుగా పేరున్న వీరిద్దరి అరెస్ట్ ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరికీ చిత్తూరు జిల్లా నాలుగో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పుంగనూరు, మదనపల్లె పరిసరాల్లో జరిగిన వేల కోట్ల భూ కుంభకోణాలను కప్పిపుచ్చడానికే ఫైళ్లను తగలబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. 22-A భూములు, నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం, పేదల భూములను అక్రమంగా మ్యూటేషన్ చేయడం, కోర్టు కేసులు, విచారణల్లో ఉన్న కీలక పత్రాలను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి.

కూటమి ప్రభుత్వం ఈ కేసును సవాల్‌గా తీసుకుంది. కేవలం కింది స్థాయి అధికారులపై చర్యలతో సరిపెట్టకుండా, ఈ కుట్ర వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిదనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఎవరి ఆదేశాల మేరకు ఫైళ్లకు నిప్పు పెట్టారు? ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అన్న ప్రశ్నలకు ఇప్పుడు పట్టుబడిన నిందితుల ద్వారా సమాధానాలు లభించే అవకాశం ఉంది.

అరెస్ట్ అయిన ముని తుకారాం, మాధవరెడ్డి ఇచ్చే వాంగ్మూలం ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ వీరు నోరు విప్పితే, ఈ విచారణ సెగ నేరుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. CID విచారణ వేగవంతం కావడంతో త్వరలోనే మదనపల్లె భూ కుంభకోణంపై పూర్తి స్థాయి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • ap news Madanapalle
  • ARREST
  • Former CM YS Jaganmohan Reddy
  • Madanapalle Files Burnt Case
  • madanapalle incident
  • peddireddy ramachandra reddy
  • ycp leaders peddireddy ramachandra reddy
  • YSR Congress Party

Related News

TDP MLA Chadalavada Aravinda Babu

Chandrababu Naidu: టీడీపీ ఎమ్మెల్యే అరవింద బాబు తీరుపై చంద్రబాబు సీరియస్

Chadalavada Aravinda Babu పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే… నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు బైఠాయించడం వివాదానికి కేం

    Latest News

    • రేపే శాంతి చ‌ర్చ‌లు.. టెన్ష‌న్ పెంచుతున్న పరిస్థితులు!

    • చీర క్యాన్సర్ ఎలా వస్తుంది?

    • లక్నో సూపర్ జెయింట్స్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • డిజిటల్ జనగణన.. 5.72 లక్షలకు పైగా కుటుంబాలు సెల్ఫ్-ఎన్యూమరేషన్!

    • Property Tax : ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ ఊరట

    Trending News

      • భారత్- ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్.. స్టార్ ప్లేయ‌ర్ దూరం!

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd