HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lokesh Yuvagalam Yatra In Penamaluru

Yuvagalam : పెన‌మ‌లూరులో పోటెత్తిన జ‌నం.. తెల్ల‌వారుజామున వ‌ర‌కు సాగిన లోకేష్ పాద‌యాత్ర‌

ఉమ్మ‌డి కృష్ణాజిల్లా నారా లోకేష్ చేప‌ట్టిన పాద‌యాత్రకు ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌డుతున్నారు. నిన్న విజ‌య‌వాడ ఈస్ట్

  • Author : Prasad Date : 21-08-2023 - 7:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yuvagalam
Yuvagalam

ఉమ్మ‌డి కృష్ణాజిల్లా నారా లోకేష్ చేప‌ట్టిన పాద‌యాత్రకు ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌డుతున్నారు. నిన్న విజ‌య‌వాడ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రారంభ‌మైన పాద‌యాత్ర పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి చేరుకుంది. పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో నారా లోకేష్‌కు ఇంఛార్జ్ బోడే ప్ర‌సాద్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అడుగ‌డుగునా లోకేష్‌కి మ‌హిళ‌లు అపూర్వస్వాగ‌తం పలికారు. అర్థ‌రాత్రి దాటిన ప్ర‌జ‌లు లోకేష్ ను క‌లిసేందుకు రోడ్ల‌పైనే వేచి ఉన్నారు. మ‌హిళ‌లు చిన్నారులు లోకేష్‌ని క‌లిసేందుకు పోటీప‌డ్డారు. పెద్దసంఖ్యలో మహిళలు నారా లోకేష్‌ని క‌లిసి సంఘీభావం తెలిపారు. షెడ్యూల్ లో ఉన్న స‌మ‌యం కంటే 4గంటల ఆలస్యంగా పాదయాత్ర కొన‌సాగింది. అందరినీ ఆప్యాయంగా పలకలరిస్తూ నారాల లోకేష్ ముందుకుసాగారు. యువనేత లోకేష్ ను చూసేందుకు బ్రిడ్జిలు, భవనాలపైకి ఎక్కారు.

పాద‌యాత్ర‌లో నారా లోకేష్ ను కలిసిన కంకిపాడు మండల ప్రజలు క‌లిశారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి సెంటర్ లో కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు, వణుకూరు, మద్దూరు, కాసరనేనిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. త‌మ మండలంలో టీడీపీ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోడ్లపై గుంతల్లో తట్ట మట్టి పోసిన దాఖలాలు లేవని లోకేష్‌కి ప్ర‌జ‌లు తెలిపారు. ఉప్పులూరు నుండి ఈడుపుగల్లు మీదుగా మద్దూరు వరకు ఆర్.అండ్.బి రహదారి నిర్మాణానికి టీడీపీ హయాంలో అంచనాలు తయారుచేసి, టెండర్లు కూడా పిలిచారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రతిపాదనలు ఎక్కడివక్కడే నిలచిపోయాయన్నారు.

బందరు రోడ్డు నుండి ఏలూరు రోడ్డులోకి వెళ్లే రోడ్డు మొత్తం గతుకులమయమై ఇబ్బందులు పడుతున్నామ‌ని. టీడీపీ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన రోడ్డు పనులు పూర్తిచేయాలని గ్రామ‌స్తులు లోకేష్‌ని కోరారు. జగన్మోహన్ రెడ్డికి పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ధ మౌలిక సదుపాయాల కల్పనపై లేదన్నారు నారా లోకేష్‌.. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెనమలూరు నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా రోడ్లపై తట్టడు మట్టి పోసిన దాఖలాలు లేవని.. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు 1.30లక్షల కోట్లరూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టారన్నారు. దివాలాకోరు ప్రభుత్వాన్ని చూసి ఏ కాంట్రాక్టర్ పనులు చేయడానికి ముందుకు రావడంలేదని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప్పులూరునుంచి ఈడ్పుగల్లుమీదుగా మద్దూరు ఆర్ అండ్ బి రహదారి నిర్మాణాన్ని చేపడతామ‌ని లోకేష్ గ్రామ‌స్తుల‌కు హ‌మీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh’s Krishna district
  • krishna district
  • Lokesh
  • nara lokesh
  • Padayatara
  • penamaluru
  • vijayawada
  • yuvagalam

Related News

Nara Bhuvaneshwari Anna Canteens

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • AP Education Minister Nara Lokesh

    TDP Working President : నారా లోకేష్ పదవి పై వర్మ కీలక వ్యాఖ్యలు

  • nara lokesh with pawan kalyan

    నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

  • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd