HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lokesh Takes Charge As Tdp National Working President

TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు

తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాల నేపథ్యంలో, యువ నాయకత్వానికి పట్టం కడుతూ నారా లోకేశ్ జాతీయ వర్కింగ్

  • Author : Sudheer Date : 29-04-2026 - 2:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh Tdpworking
Lokesh Tdpworking

తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాల నేపథ్యంలో, యువ నాయకత్వానికి పట్టం కడుతూ నారా లోకేశ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నారా లోకేశ్ పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో లోకేశ్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేశారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి రికార్డు మెజారిటీతో విజయం సాధించి, మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న లోకేశ్.. ఇప్పుడు పార్టీ వ్యవహారాల్లో పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకుని సంబరాలు చేసుకున్నాయి.

యువతకు, అనుభవానికి పెద్దపీట

లోకేశ్‌తో పాటు పార్టీకి మరింత ఊపు తెచ్చేందుకు జాతీయ స్థాయి కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. మొత్తం 18 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసి, వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఇందులో సీనియర్ నాయకులతో పాటు సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ నూతన కార్యవర్గాన్ని చంద్రబాబు తీర్చిదిద్దారు. లోకేశ్ నేతృత్వంలో ఈ బృందం అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాల్లో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించేలా కార్యాచరణ సిద్ధం చేసింది.

యువ రక్తం.. కొత్త ఉత్సాహం

పార్టీలో యువ రక్తాన్ని నింపి, డిజిటల్ యుగానికి అనుగుణంగా పార్టీని ఆధునీకరించడం లోకేశ్ ముందున్న ప్రధాన లక్ష్యం. ఇప్పటికే ‘యువగళం’ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువైన ఆయన, ఇకపై కేడర్‌ను ఎన్నికల దిశగా ఎప్పుడూ సిద్ధంగా ఉంచే బాధ్యతను భుజాన వేసుకోనున్నారు. ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఆకర్షించడం, ఐటీ మరియు సోషల్ మీడియా విభాగాలను బలోపేతం చేయడంలో లోకేశ్ కీలకంగా వ్యవహరించనున్నారు. చంద్రబాబు పాలనపై దృష్టి సారిస్తుంటే, లోకేశ్ పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడంపై దృష్టి పెడతారని సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • APPolitics
  • mangalagiri
  • NaraChandraBabuNaidu
  • naralokesh
  • tdp
  • TeluguDesamParty
  • WorkingPresidentLokesh

Related News

Mahandu 2026

TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

టీడీపీ మహానాడు కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలు, పార్టీ పాత్ర, భవిష్యత్ వ్యూహాలపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ పార్టీ చరిత్ర, అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. బక్కని నరసింహులు మాట్లాడుతూ .. తెలంగాణలో పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిన ఘనత ఎన

  • MAHANADU

    TDP : సూపర్ సిక్స్ సూపర్ హిట్.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మ‌హానాడులో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి

  • Mahandu 2026

    Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం

  • Ys Sharmila

    YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్

  • Sai Vaishnavi Nellore

    Nellore : రాజ‌కీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కుమార్తె.. ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌లోనే అద‌ర‌గొట్టిన సాయివైష్ణ‌వి

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd