Liquor Shops: మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేటి నుంచి వైన్స్ బంద్
తెలంగాణలో మద్యం ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. తెలంగాణాలో నేటి నుంచి అన్ని రకాల మద్యం షాపులు (Liquor Shops) బంద్ కానున్నాయి. ఈనెల 13న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
- By Gopichand Published Date - 06:39 AM, Sat - 11 March 23

తెలంగాణలో మద్యం ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. తెలంగాణాలో నేటి నుంచి అన్ని రకాల మద్యం షాపులు (Liquor Shops) బంద్ కానున్నాయి. ఈనెల 13న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఈ మూడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈనెల 11వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్స్‌లు మూసేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో కూడా ఈ నెల 13న ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో మూడు రోజుల పాటు లిక్కర్ షాపులు మూతపడనున్నాయి.
Also Read: Japan PM: భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని.. కారణమిదే..?
విశాఖపట్నం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఈ నెల 13న జరగనున్న ఉత్తర కోస్తా ఆంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో మూడు రోజుల పాటు అన్ని మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13 సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు (స్టార్ హోటళ్లలో కూడా), టూరిజం బార్‌లు, నేవల్ క్యాంటీన్లు, మద్యం డిపోలు మూతపడనున్నాయి. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే 16వ తేదీన కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరవకూడదు అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 16న వెలువడనున్నాయి.

Related News

BJYM : బీజేవైఎం కార్యకర్తలకు బెయిల్ మంజూరు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నిరసనలో అరెస్ట్
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలకు బెయిల్ మంజూరైంది. పరీక్ష పేపర్ లీక్ స్కామ్ నేపథ్యంలో