Tirumala: తిరుమలలో చిరుతపులి కలకలం.. భయాందోళనలో భక్తులు!
తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. వివిధ వన్యప్రాణులకు నిలయం కూడా.
- Author : Balu J
Date : 13-07-2023 - 11:53 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. వివిధ వన్యప్రాణులకు నిలయం కూడా. జింకల నుంచి చిరుతలు వరకు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రమాదకర జంతువులు చిరుతలు, పులులు తిరుమల మెట్ల మార్గంలోకి వస్తుండటంతో భక్తులు భయపడిపోతున్నారు. తాజాగా తిరుమల ఘాట్ రోడ్డులోని 56వ హెయిర్‌పిన్ వంక వద్ద చిరుతపులి కనిపించడంతో భక్తులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు.
దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు గుంపులు గుంపులుగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం చిరుతను అడవిలోకి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలిపిరి ఫుట్‌పాత్‌పై చిరుతపులి చిన్నారిపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మళ్లీ చిరుతపులి ప్రత్యక్షమైంది.
గతంలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌశిక్ అనే నాలుగేళ్ల బాలుడిపై పోలీసు అవుట్‌పోస్టు సమీపంలో చిరుతపులి దాడి చేసింది. ఈ ఘటనలో కౌశిక్ చెవి వెనుక, తలపై గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు. అయితే తిరుమల కొండలో తరచుగా పులులు ప్రత్యక్షం కావడంతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Woman Slaps MLA: ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టిన మహిళ, వీడియో వైరల్