HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Land Titling Act Repeal Bill Ap Assembly Unanimously Approved

AP Assembly : ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు బిల్లు..ఏపి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

  • Author : Latha Suma Date : 23-07-2024 - 2:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Land Titling Act Repeal Bill..AP Assembly unanimously approved
Land Titling Act Repeal Bill..AP Assembly unanimously approved

AP Assembly: రెండో రోజు ఏపి శాసనసభ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంతి అనగాని సత్యప్రసాద్‌(Anagani Satya Prasad) ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు బిల్లు(Land Titling Act Repeal Bill)ను ప్రవేశపెట్టారు. తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బిల్లు రద్దు చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం.
అచ్చమైన తెలుగులో, ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా చదివిన సభాపతిని అభినందించిన అసెంబ్లీ సభ్యులు.#APAssembly#AndhraPradesh pic.twitter.com/QcLC6jPisS

— Telugu Desam Party (@JaiTDP) July 23, 2024

ఈ సందర్భంగా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు(Speaker Ayyanna Patra) ఒక్క ఇంగ్లీషు పదం కూడా లేకుండా సభా వ్యవహారాలు నడిపించడం విశేషం. దాంతో ఆయనను సభ్యులందరూ అభినందించారు. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏమిటంటే..ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లు-2024ను ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన పట్ల సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి..వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి” అంటూ అయ్యన్నపాత్రుడు పూర్తిగా తెలుగులో మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే అందరూ అవును అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమైనది అంటూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. దీనిపై శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav)పైకి లేచి… మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడి బిల్లును ప్రవేశపెట్టడం హర్షణీయం అని అయ్యన్నపాత్రుడిని అభినందించారు. పైగా, మా అందరికీ ఇష్టమైన బిల్లును తెలుగులో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్ అంటూ చమత్కరించారు. ఈ రోజు నుంచి మీరొక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు… మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ పయ్యావుల పేర్కొన్నారు.

Read Also: Union Budget 2024-25 Highlights : బడ్జెట్‌ హైలైట్స్

 

 

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP Assembly Session
  • ayyanna patrudu
  • Land Titling Act Bill

Related News

Nara Lokesh

Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

    Latest News

    • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

    • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

    • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    Trending News

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd