Shocking : ప్రేమికులను టార్గెట్ చేసిన గ్యాంగ్.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Shocking : ప్రేమలో మునిగిపోయిన జంటలకు ఏ క్షణం అయినా ప్రత్యేకమే. ఫోన్‌లో చాటింగ్‌లు, సంభాషణలు.. సమయం దొరికినప్పుడల్లా కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు.. పార్కులు, షికార్లు, సినిమాలు, దేవాలయాల ప్రాంగణాలు.. ఏదో ఒక ప్రదేశంలో కలుసుకుని తమ సమయాన్ని గడుపుతుంటారు.
- By Kavya Krishna Published Date - 11:30 AM, Fri - 29 August 25

Shocking : ప్రేమలో మునిగిపోయిన జంటలకు ఏ క్షణం అయినా ప్రత్యేకమే. ఫోన్‌లో చాటింగ్‌లు, సంభాషణలు.. సమయం దొరికినప్పుడల్లా కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు.. పార్కులు, షికార్లు, సినిమాలు, దేవాలయాల ప్రాంగణాలు.. ఏదో ఒక ప్రదేశంలో కలుసుకుని తమ సమయాన్ని గడుపుతుంటారు. కానీ, ఈ క్షణాలే కొందరికి బలహీనతగా మారుతున్నాయి. ఒంటరిగా, ఏకాంతంగా కనిపించే ప్రేమజంటలనే లక్ష్యంగా చేసుకుని వేట మొదలుపెట్టిన ఒక ముఠా కర్నూలులో కలకలం రేపింది. నగర శివారులో ఈ ముఠా దాదాపు పలు ప్రేమజంటలను టార్గెట్ చేస్తూ వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు, బంగారం దోచుకునే పనిలో పడ్డారు. జంటలను భయపెట్టడం, వారి వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేస్తామని బెదిరించడం ద్వారా నగదు వసూలు చేస్తున్నారు.
Teachers : దేశ వ్యాప్తంగా కోటి దాటిన టీచర్ల సంఖ్య
ఇటీవల ఒక యువతి నుంచి బంగారు గొలుసు, నగదు లాక్కొన్న వీరు, ఆ తర్వాత కూడా తృప్తి పడకపోగా మళ్లీ డబ్బులు ఇవ్వాలని ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ఇలాంటి పరిస్థితిలో విసిగిపోయిన బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న ఫోర్త్ టౌన్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రంగంలోకి దిగిన పోలీసులు ముఠా సభ్యులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ముజఫర్‌నగర్‌కు చెందిన గోర్లగుట్ట నాగేంద్రుడు, ప్రజానగర్‌కు చెందిన రమేష్, దిన్నెదేవరపాడు నివాసి మాలిక్ బాషా ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న పోలీసులు, మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
Bigboss : ఛాన్స్‌ల కోసం పడుకున్నా తప్పులేదంటున్న బిగ్ బాస్ బ్యూటీ
కానీ, ఈ కేసు ఇంతటితో ఆగిపోలేదు. నిందితులకు కొందరు పోలీసులే మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలు వెలువడటంతో మరింత కలకలం రేగింది. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోమ్‌గార్డు ఈ ముఠాకు సహకరిస్తున్నారన్న అనుమానాలపై అంతర్గత విచారణ మొదలుపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అధికారికంగా నిర్ధారణ అయితే, సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని సూచించారు. ప్రస్తుతం ఈ ఘటన కర్నూలు నగరంలో చర్చనీయాంశంగా మారింది. ప్రేమజంటలపై ఇలాంటి వేట కొనసాగుతుండటంతో, పోలీసులు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఒకవైపు నిందితులను పట్టుకోవడం, మరోవైపు లోపల నుంచే సహకారం లభిస్తోందన్న ఆరోపణలపై విచారణ సాగుతుండటంతో కేసు మరింత సున్నితమైనదిగా మారింది.