Kodali Nani : సీఎం చంద్రబాబు షూ పాలిష్ చేస్తున్న కొడాలి నాని.. కారణం తెలుసా.?
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయం.. ఎప్పుడూ ఆసక్తికరమే.. ఇప్పుడు.. ఒక ఫ్లెక్సీ.. గుడివాడ నుంచి రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది..!
- By Kavya Krishna Published Date - 05:20 PM, Sat - 12 July 25

Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయం.. ఎప్పుడూ ఆసక్తికరమే.. ఇప్పుడు.. ఒక ఫ్లెక్సీ.. గుడివాడ నుంచి రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది..! మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ లీడర్.. కొడాలి నానిని టార్గెట్ చేస్తూ.. టీడీపీ కార్యకర్తలు పెట్టిన ఒక ఫ్లెక్సీ.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గుడివాడలో వెలిసిన ఈ ఫ్లెక్సీలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయి ఊపుతున్న ఫోటో పైన ఉండగా.. దాని కింద.. షాకింగ్ గా.. కొడాలి నాని షూ పాలిష్ చేస్తున్నట్లుగా ఉన్న ఒక పిక్చర్..! అవును.. మీరు విన్నది నిజం!
ఫ్లెక్సీపై రాసిన మాటలు మరింత సంచలనంగా ఉన్నాయి.. “కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి, ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి… కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటకు రావాలి!”.. అంటూ టీడీపీ గుడివాడ కార్యకర్తలు నేరుగా కొడాలి నానికే సవాల్ విసిరారు..!
ఈ ఫ్లెక్సీ వెనుక.. కొడాలి నాని గతంలో చేసిన ఒక పాత ఛాలెంజ్ ఉంది. చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే.. రాజకీయాలను వదిలేసి.. ఆయన షూ పాలిష్ చేస్తానని నాని గతంలో బహిరంగంగా అన్నారు.. ఇప్పుడు చంద్రబాబు కుప్పం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో.. టీడీపీ శ్రేణులు ఆ ఛాలెంజ్‌ని గుర్తు చేస్తూ.. గుడివాడలో ఈ ఫ్లెక్సీని పెట్టారు. కొడాలి నాని ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న నేపథ్యంలో.. ఆయన ఎక్కడున్నా బయటకు వచ్చి.. తన మాట నిలబెట్టుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది..!
ఈ ఫ్లెక్సీ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అభిమానులు దీన్ని షేర్ చేస్తూ.. కొడాలి నానిని ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు కొడాలి నానికి అడ్డాగా ఉన్న గుడివాడలో.. ఇప్పుడు ఇలాంటి ఫ్లెక్సీలు వెలవడం.. అక్కడి రాజకీయ వాతావరణం ఎలా మారిందో చెబుతోంది.