Telugu States Leaders : ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు నేతల ప్రచార హోరు.. రేవంత్, పవన్ సైతం
ఢిల్లీకి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల్లో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్(Telugu States Leaders) తదితరులు ఉన్నారు.
- By Pasha Published Date - 07:48 PM, Mon - 27 January 25

Telugu States Leaders : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగబోతోంది. కేవలం 8 రోజులు గడిస్తే ఢిల్లీ ప్రజలు ఈవీఎంలు నొక్కి తమకు పాలకులుగా ఎవరు ఉండాలో తేల్చేస్తారు. ఈసారి హస్తినలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీలకు మద్దతుగా గళం విప్పుతున్నారు.
Also Read :Saif Ali Khan : సైఫ్‌పై దాడి కేసులో ట్విస్ట్.. బెంగాలీ మహిళ అరెస్ట్.. ఎవరంటే..
తెలంగాణ, ఏపీ నేతల క్యూ..
ఢిల్లీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ సీఎం రేవంత్ ఇటీవలే ఆవిష్కరించారు. ఇప్పటికే తాము తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత హామీల గురించి ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాబోయే కొన్ని రోజుల పాటు ఢిల్లీ గడ్డపై పెద్దఎత్తున రేవంత్ ప్రచారం చేయబోతున్నారు. మరోవైపు బీజేపీ కూడా హస్తినలో ప్రచార వేగాన్ని పెంచింది. తెలంగాణ, ఏపీ నుంచి తమ నేతలను రప్పించి ఢిల్లీలో ప్రచారం చేయిస్తోంది. ఢిల్లీలో ఉంటున్న తెలుగు ఓటర్ల మనసులను గెల్చుకోవడమే టార్గెట్‌గా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read :Noida TO NASA : ఆస్టరాయిడ్‌ను గుర్తించిన భారత విద్యార్థి.. నాసా బంపర్ ఆఫర్
రేపో, మాపో ఢిల్లీకి పవన్ కళ్యాణ్
ఢిల్లీకి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల్లో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్(Telugu States Leaders) తదితరులు ఉన్నారు. వారు ఢిల్లీలో తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీజేపీ గెలిస్తే అమలయ్యే ఎన్నికల హామీల గురించి వివరిస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. ఢిల్లీలోనూ ఆయనతో ప్రచారం చేయించాలనే ప్లాన్‌తో బీజేపీ ఉందట. ఇటీవలే ఏపీ పర్యటన సందర్భంగా ఈవిషయంపై పవన్‌తో అమిత్‌షా చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో ప్రచారం చేయిస్తే కలిసొస్తుందని షా భావిస్తున్నారట. ఎన్నికల ప్రచారం కోసం ఈ వారం చివర్లో ఢిల్లీకి పవన్ వెళ్తారని తెలుస్తోంది.