Jagan : జగన్ వెనుక కేసీఆర్..? నిజమేనా..?
Jagan : ఉద్యమ సమయంలో కేసీఆర్ (KCR) నేరుగా రోడ్లపైకి రాకుండా ఇంట్లో నుంచే ఆదేశాలు ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారా? లేదా కేసీఆర్ సలహాల మేరకా ఈ మార్పులు వస్తున్నాయా? అనే చర్చ
- By Sudheer Published Date - 08:11 PM, Wed - 4 June 25

జూన్ 4న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP ) నిర్వహించిన “వెన్నుపోటు దినోత్సవం” (Vennupotu) రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం పొందింది. కార్యకర్తలు ఊరూరా ర్యాలీలు నిర్వహించగా, ముఖ్య నేతలు కూడా రోడ్డెక్కారు. రోజా పూలతో, అంబటి పోలీసులతో గొడవతో, బొత్స కుప్పకూలడంతో ఈ ఆందోళనలు హాట్ టాపిక్ అయ్యాయి. కానీ ఈ అంతా జరగుతున్న సమయంలో వైసీపీ అధినేత జగన్(Jagan) మాత్రం ఏపీలో లేరు. బెంగళూరులోని ప్యాలెస్ నుంచే ఈ పరిణామాలను తిలకించడమే కాకుండా, ట్వీట్లు చేసి “వెన్నుపోటు విజయవంతం” అంటూ వ్యాఖ్యానించడం రాజకీయవర్గాల్లో సందేహాలకు దారి తీస్తోంది.
Vennupotu : పోలీసులపై రాంబాబు ‘రుబాబు’..అవసరం బాబు ఈ బ్యాడ్ టైంలో !!
జగన్ ఇప్పుడు చేస్తున్న రాజకీయ వ్యూహాలు, గతంలో ఉద్యమ సమయంలో కేసీఆర్ అనుసరించిన పద్ధతులతో పోలుస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ (KCR) నేరుగా రోడ్లపైకి రాకుండా ఇంట్లో నుంచే ఆదేశాలు ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారా? లేదా కేసీఆర్ సలహాల మేరకా ఈ మార్పులు వస్తున్నాయా? అనే చర్చను ఇది తెరపైకి తెచ్చింది. జగన్ మునుపటి విధానాల ప్రకారం ఎలాంటి కార్యక్రమానికైనా తానే ముఖచిత్రంగా నిలిచేవారు. కానీ ఇప్పుడు తనను పక్కన పెట్టి నేతల్ని ముందుకు నెట్టడం వెనుక రాజకీయ ప్రేరణ ఉందా? కేసీఆర్ మార్క్ రాజకీయాల ప్రభావమా? అనేది ఆసక్తికరమైన కోణంగా మారింది.
Jagan Missing : వెన్నుపోటు అన్నాడు..అడ్రెస్ లేకుండా పోయాడు..ఏంటి జగనన్న
ఇక ఇటీవల జరుగుతున్న లిక్కర్ స్కాం అరెస్టుల నేపథ్యంలో జగన్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేసీఆర్ ద్వారా డబ్బు సహాయం జరుగుతోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ పలువురు ప్రాంతీయ నేతలకు ఆర్థిక సహాయం చేసిన చరిత్రను ప్రస్తావిస్తూ, ఇప్పుడు జగన్‌కి కూడా అదే సాయం చేస్తున్నారన్న మాట ప్రచారంలో ఉంది. రెండు రాష్ట్రాల ప్రతిపక్ష నేతలైన ఈ ఇద్దరు నాయకుల మధ్య ముడిపడి ఉన్న బంధం, ఒకరికి ఒకరు వ్యూహాల పంచుకోవడం వల్ల ఏపీ రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం పెరుగుతోందా? అనే అనుమానం బలంగా వినిపిస్తోంది. నిజంగా జగన్ వెనుక కేసీఆర్ ఉన్నారా? లేక ఇదంతా కేవలం పుకార్లేనా అనేది తెలియాల్సి ఉంది.