Jagan Missing : వెన్నుపోటు అన్నాడు..అడ్రెస్ లేకుండా పోయాడు..ఏంటి జగనన్న
Jagan Missing : జగన్ నిజంగా ప్రజా పోరాటాల పట్ల ఆసక్తి ఉంటే, రాష్ట్రంలోనే ఉండి నాయకత్వం వహించాలన్నది విశ్లేషకుల అభిప్రాయం
- Author : Sudheer
Date : 04-06-2025 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా “వెన్నుపోటు దినం” (Vennupotu Dinam) పేరుతో నిరసన కార్యక్రమాలు అంతంత మాత్రంగానే సాగింది. పల్నాడు, అమలాపురం, చిత్తూరు, విజయవాడ, రాజంపేట వంటి ప్రాంతాల్లో ర్యాలీలు, వినూత్న నిరసనలు కనిపించాయి. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పూనూరి గౌతమ్ రెడ్డి నేతృత్వంలో ర్యాలీ జరిగింది. కార్యకర్తలు ఎండలో తిరుగుతూ ఆందోళనలు చేస్తూ పార్టీ పిలుపునకు పెద్దపీట వేశారు.
HHVM Postponed : వీరమల్లు రిలీజ్ కు బ్రేక్ వేసింది వారేనా..?
అయితే ఈ ఉత్సాహభరితమైన నిరసన కార్యక్రమాల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్ (Jagan) గైర్హాజరుకావడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. తనే ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చి, చివరికి పాల్గొనకపోవడం పట్ల కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెనాలిలో ఒక పరామర్శ కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా బెంగళూరుకు వెళ్లిపోవడం పట్ల నేతలు మండిపడుతున్నారు. గతంలో చంద్రబాబు, పవన్‌లను రాజకీయ పర్యాటకులుగా ఎగతాళి చేసిన వైసీపీ, ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో జగన్ బెంగళూరులో ఉండడంపై విమర్శలు పెరుగుతున్నాయి. కార్యకర్తలు, నేతలు ఎదురవుతున్న కేసులను పార్టీ పరంగా ఓ వ్యూహంగా మలుచుకోవాలన్న జగన్ ప్రణాళికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ నిజంగా ప్రజా పోరాటాల పట్ల ఆసక్తి ఉంటే, రాష్ట్రంలోనే ఉండి నాయకత్వం వహించాలన్నది విశ్లేషకుల అభిప్రాయం. వాస్తవానికి, కార్యకర్తలు వదిలేసి జగన్ బెంగళూరు నుంచి పార్టీని పర్యవేక్షించడం వల్ల వైసీపీ పునర్నిర్మాణం కార్యసాధ్యం కాదన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో మొదలవుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.