Kavach In AP : ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే రూట్లకు రూ.2,104 కోట్ల రక్షణ ‘కవచం’
దీనివల్ల రైళ్లను(Kavach In AP) మధ్యలో ఆపడం, ప్రధాన రైల్వే స్టేషన్ల సమీపంలోహాల్టింగ్‌లో ఉంచడం వంటి సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి.
- By Pasha Published Date - 10:17 AM, Wed - 6 November 24

Kavach In AP : కవచ్ వ్యవస్థ.. రైలు మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా నివారిస్తుంది. రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును నడిపితే, కవచ్ వ్యవస్థ అతడిని అలర్ట్ చేస్తుంది. బ్రేక్‌లను తన నియంత్రణలోకి తెచ్చుకొని ప్రమాదాలు జరగకుండా అడ్డుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని మూడు కీలక రైలు మార్గాల్లో కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. దువ్వాడ – విజయవాడ, విజయవాడ – గూడూరు, మంత్రాలయం రోడ్ – రేణిగుంట రైలు మార్గాల్లో ఈ రక్షణ ‘కవచం’ అందుబాటులోకి రానుంది. దీంతోపాటు ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ విధానాన్ని ఈ రూట్లలో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రైళ్లను(Kavach In AP) మధ్యలో ఆపడం, ప్రధాన రైల్వే స్టేషన్ల సమీపంలోహాల్టింగ్‌లో ఉంచడం వంటి సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది.
Also Read :Brutal Murder : ఆభరణాల కోసం పొరుగింటి మహిళ మర్డర్.. నెల్లూరులో దారుణం
- కవచ్, ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థలను ఈ మూడు రూట్లలో ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ దాదాపు రూ.2,104 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ పనులను 2026-2027 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తిచేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.
- కవచ్ వ్యవస్థ నిర్మాణంలో భాగంగా దువ్వాడ – విజయవాడ, విజయవాడ – గూడూరు, మంత్రాలయం రోడ్ – రేణిగుంట మార్గాల్లోని రైల్వే స్టేషన్‌లలో, రైలు ఇంజిన్లలో, పట్టాలలో, సిగ్నలింగ్ వ్యవస్థలో ఎలక్ట్రానిక్, రేడియో ఫ్రీక్వెన్సీ పరికరాలను అమరుస్తారు. ఈ పరికరాలు జీపీఎస్‌తో అనుసంధానమై పనిచేస్తాయి.
Also Read :US Election Results : అమెరికా ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ 198 Vs కమల 109
- దువ్వాడ-విజయవాడ మధ్య 332 కి.మీ మేర.. బల్హార్షా-విజయవాడ-గూడూరు మార్గంలో 742 కి.మీ మేర.. వాడి-గుంతకల్లు-రేణిగుంట మార్గంలో 538 కి.మీ మేర కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
- ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలోని రైల్వే రూట్లలో ఇంటర్మీడియట్ బ్లాక్ (ఐబీ) సిగ్నలింగ్ విధానం వినియోగంలో ఉంది.
- ఐబీ సిగ్నలింగ్ వ్యవస్థలో.. ఓ రైలు మొదటి స్టేషన్‌లోని డిస్పాచ్ సిగ్నల్ దాటి బయలుదేరి, తర్వాత స్టేషన్‌లోని హోం సిగ్నల్‌లోకి చేరుకునే వరకు.. అదే లైనులో వెనుక మరొక రైలును పంపరు.
- ఇప్పుడు ఐబీ సిగ్నలింగ్ స్థానంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రైల్వే స్టేషన్ల మధ్య దూరాన్ని బ్లాక్‌లుగా విభజిస్తారు. రైలు బయలుదేరి ఆ బ్లాక్‌ను దాటగానే.. వెనుక మరొక రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు.
- దువ్వాడ-విజయవాడ రైల్వే రూటులో ఇప్పటికే విజయవాడ-నూజివీడు, నిడదవోలు-కడియం, నర్సింగపల్లి-తాడి స్టేషన్ల మధ్య ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ విధానం అందుబాటులోకి వచ్చింది.