HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Brutal Murder In Nellore 149 Km Journey With Dead Body In Suitcase

Brutal Murder : ఆభరణాల కోసం పొరుగింటి మహిళ మర్డర్.. నెల్లూరులో దారుణం

సూట్‌కేసులో రమణి డెడ్‌బాడీని తీసుకొని వెళ్తున్న బాలసుబ్రహ్మణ్యం, అతడి కుమార్తె దివ్యశ్రీలను తమిళనాడులోని తిరువళ్లూ జిల్లా మీంజూరు రైల్వే పోలీసులు(Brutal Murder) పట్టుకున్నారు.

  • Author : Pasha Date : 06-11-2024 - 9:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brutal Murder In Nellore Dead Body In Suitcase

Brutal Murder : నెల్లూరులోని రాజేంద్రనగర్‌లో దారుణ మర్డర్ జరిగింది. ‘‘కొత్తగా ఇల్లు కట్టాం.. టీ తాగండి’’ అంటూ పొరుగునే ఉండే మణ్యం రమణి (65)  అనే వృద్ధురాలిని..  బాలసుబ్రహ్మణ్యం, అతడి కుమార్తె దివ్యశ్రీ తమ ఇంట్లోకి పిలిచారు. ఆమె టీ తాగుతుండగా తాడును గొంతుకు బిగించి మర్డర్ చేశారు. అనంతరం డెడ్‌బాడీని సూట్‌కేస్‌లో పెట్టి చెన్నైకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సోమవారం ఉదయం కూరగాయల కోసం బయటికి వెళ్లిన రమణి ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read :US Election Results : అమెరికా ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ 198 Vs కమల 109

సూట్‌కేసులో రమణి డెడ్‌బాడీని తీసుకొని వెళ్తున్న బాలసుబ్రహ్మణ్యం, అతడి కుమార్తె దివ్యశ్రీలను తమిళనాడులోని తిరువళ్లూ జిల్లా మీంజూరు రైల్వే పోలీసులు(Brutal Murder) పట్టుకున్నారు. దీనిపై మంగళవారం రోజు నెల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం ఫొటోను పరిశీలించిన నెల్లూరు పోలీసులు.. అది రమణి డెడ్‌బాడీ అని గుర్తించారు. దీంతో మింజూరు రైల్వే పోలీసులు తండ్రీకుమార్తెలను విచారించగా.. హత్య చేశామని ఒప్పుకున్నారు.

Also Read :IPL Auction: ఐపీఎల్ వేలంలోకి 42 ఏళ్ల ఆటగాడు.. ఎవ‌రా స్టార్ ప్లేయ‌ర్‌?

హత్య జరిగింది ఇలా.. 

‘‘మేం ఆర్థిక ఇబ్బందుల్లో  ఉన్నాం. అందుకే రమణి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకోవాలని ప్లాన్ చేశాం. మా ప్లాన్‌లో భాగంగా సోమవారం ఉదయం కూరగాయల దుకాణం వద్ద రమణిని  మా నాన్న బాలసుబ్రహ్మణ్యం కలిశాడు. ఆమెను మాటల్లో పెట్టి.. టీ తాగేందుకు ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెను హత్య చేసి.. ఒంటిపై ఉన్న నల్లపూసల దండ, కమ్మలు తదితర బంగారు ఆభరణాలు తీసుకున్నాం. ట్రావెల్‌ సూట్‌‌కేసులో రమణి డెడ్‌బాడీని కుక్కాం. అనంతరం నెల్లూరు స్టేషనులో చెన్నై వెళ్లే ప్యాసింజర్‌ రైలు ఎక్కాం. రైలులో జనం ఎక్కువగా ఉండటంతో సూట్‌‌కేసును పడేయడం కుదరలేదు. చెన్నై సమీపంలోని మీంజూరు స్టేషన్‌లో దిగి, ప్లాట్‌ఫాంపై సూట్‌కేస్‌ వదిలేందుకు యత్నించాం. దీనిపై  ఓ యువకుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చి సూట్‌కేసును పరిశీలించగా.. అందులో నుంచి డెడ్‌బాడీ బయటపడింది’’ అని బాలసుబ్రహ్మణ్యం కుమార్తె దివ్యశ్రీ వివరించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brutal Murder
  • crime
  • dead body
  • Nellore
  • suitcase

Related News

Free Mineral Water Plant Inaugurated in Lakshmipuram

Lakshmipuram: లక్ష్మీపురంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం..

పేదలకు వరంలా మౌనిక చారిటబుల్ ట్రస్ట్ సేవలు.. రాపూరు: పేద ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని నెల్లూరు ఆర్డీవో నాగ సంతోషిణి అనూష కొనియాడారు. శుక్రవారం రాపూరులోని 10వ వార్డు లక్ష్మీపురం కాలనీలో మౌనిక చారిటబుల్ ట్రస్ట్, దేవీ సీ ఫుడ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

  • TDP Mahanadu 2026 Event In Nellore

    Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు.. వేదిక ఖరారు!

Latest News

  • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

  • Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

  • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

  • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

  • PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd