HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Karthika Celebrations In Vijayawada Indrakiladri Durgamma Decorated With 4 Lakh Bangles

Durgamma : 4 లక్షల గాజులతో వెలిగిపోయిన బెజవాడ దుర్గమ్మ

వివిధ రంగుల గాజులతో అమ్మవారిని(Durgamma) సిద్ధం చేశారు.

  • Author : Pasha Date : 03-11-2024 - 3:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayawada Indrakiladri Durgamma Bangles Karthika Celebrations

Durgamma : కార్తిక మాసం సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇవాళ యమ ద్వితీయ. ఈసందర్భంగా దుర్గమ్మను భక్తులు ఇచ్చిన లక్షలాది గాజులతో అలంకరించారు. దాదాపు 4 లక్షల గాజులతో దుర్గమ్మను సర్వాంగసుందరంగా అలంకరించారు. వివిధ రంగుల గాజులతో అమ్మవారిని(Durgamma) సిద్ధం చేశారు. ఈ అలంకరణలో వెలిగిపోతున్న అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గమ్మకు యమ ద్వితీయ రోజే గాజులు ఎందుకు అలంకరిస్తారు ? అనేది తెలుసుకోవాలంటే ‘భగినీ హస్త భోజనం’పై అవగాహన కలిగి ఉండాలి. భగినీ అంటే సోదరి. యమ ద్వితీయ రోజున సోదరులు తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లాలి. తన ఇంటికి వచ్చిన సోదరుల నుదుటన సోదరి తిలకం దిద్దాలి. అనంతరం సోదరి  స్వహస్తాలతో సోదరులకు భోజనం వడ్డించాలి.  భోజనం చేసిన అనంతరం సోదరులు ఆమెకు చీర, సారె పెట్టాలి. కార్తీక శుక్ల విదియ రోజు సోదరి ఇంటికి వెళ్లి, ఆమె చేతి వంట తినే సోదరుడి గృహంలో అపమృత్యు దోషాలు ఉండవని స్వయంగా యముడు చెబుతాడు. అందుకే యమ ద్వితీయకు చాలా  ప్రాముఖ్యత ఉంటుంది.

Also Read :Union Minister : కేంద్ర మంత్రిపై కేసు.. జాతరకు అంబులెన్సులో వెళ్లినందుకు ప్రొసీడింగ్స్

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో పుష్పాలంకరణ నిర్వహించారు. ఆలయంలోని తిరుపతమ్మ, గోపయ్య స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు  తరలివచ్చారు.

Also Read :Google Pay Laddoos : నవంబరు 7 లాస్ట్ డేట్.. ‘గూగుల్ పే’ లడ్డూలతో క్యాష్ బ్యాక్

నంద్యాల జిల్లా శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాతాళ గంగలో పుణ్య సాన్నాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఉత్తర మాడ వీధి, గంగాధర మండపం వద్ద భక్తులు దీపారాధనలు చేశారు. మొత్తం మీద కార్తిక మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, శివాలయాలు శివ నామస్మరణతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక మాసం నవంబర్ 30న ముగుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangles
  • Durgamma
  • indrakiladri
  • Karthika celebrations
  • vijayawada

Related News

Ap Ev Charging Stations

ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

EV Charging Stations  ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. తొలి దశలో 135 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల్లో 600 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో జాతీయ

  • Asus Opening

    ASUS : విజయవాడలో ఆసుస్ (ASUS) తన సరికొత్త ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ ప్రారంభం

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd