Google Pay Laddoos : నవంబరు 7 లాస్ట్ డేట్.. ‘గూగుల్ పే’ లడ్డూలతో క్యాష్ బ్యాక్
ఇందుకోసం గూగుల్ పే యూజర్లు 6 రకాల లడ్డూలను(Google Pay Laddoos) డిపాజిట్ చేయాలి.
- By Pasha Published Date - 02:03 PM, Sun - 3 November 24

Google Pay Laddoos : దీపావళి వేళ గూగుల్ పే తమ యూజర్ల కోసం బిగ్ ఆఫర్‌ను అమలు చేస్తోంది. నవంబరు 7వ తేదీ వరకు ఆ ఆఫర్ అమల్లో ఉండనుంది. యూజర్లకు రూ.51 నుంచి రూ.1,001 దాకా నగదు బహుమతిని అందజేస్తున్న లడ్డూ డిపాజిట్ ఆఫర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Yogi Adityanath : యూపీలో కలకలం.. సీఎం యోగికి ఆ మహిళ బెదిరింపు మెసేజ్
- దీపావళి అనగానే మనకు గుర్తుకొచ్చేవి లడ్డూలు. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రతీకలు లడ్డూలు.
- గూగుల్ పే యూజర్లకు రూ.51 నుంచి రూ.1001 దాకా క్యాష్ బ్యాక్‌ను ఇచ్చేందుకు ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు.
- ఇందుకోసం గూగుల్ పే యూజర్లు 6 రకాల లడ్డూలను(Google Pay Laddoos) డిపాజిట్ చేయాలి.
- నిత్యం గూగుల్ పేని ఉపయోగించే వారు ఈ ఆఫర్‌కు అర్హులు. యూజర్లు వివిధ పేమెంట్స్ చేసినప్పుడు గూగుల్ నుంచి లడ్డూ రివార్డులు లభిస్తాయి.
- క్యాష్‌బ్యాక్‌ను పొందాలంటే గూగుల్ యూజర్లు కనీసం ఆరు లడ్డూలను సేకరించి సబ్మిట్ చేయాలి.
- అక్టోబర్ 21న ప్రారంభమైన ఈ ఆఫర్ నవంబర్ 7 వరకు అమల్లో ఉంటుంది.
- యూపీఐ ద్వారా కనీసం రూ.3000 క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించినా లడ్డూలు లభిస్తాయి.
- గూగుల్ పే యాప్‌లోని ఆఫర్లు, రివార్డుల విభాగానికి వెళ్లి మన వద్ద ఎన్ని లడ్డూలు ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌కు సంబంధించిన మొత్తం సమాచారం కూడా అక్కడ లభిస్తుంది.
Also Read :Electricity Ambulances : విద్యుత్ అంబులెన్సులు వచ్చేశాయ్.. ఎమర్జెన్సీలో కాల్ 1912
- ఇప్పటిదాకా యూపీఐ పేమెంట్స్ విభాగంలో ఫోన్ పే, గూగుల్ పే హవా నడిచింది. ఇప్పుడు ఈ రేసులో జియో పే కూడా చేరింది.
- ఇటీవలే ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా ఆర్బీఐ నుంచి జియో పేకు ఆమోదం లభించింది.
- జియో పేమెంట్స్ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యూపీఐ, ఈ– వ్యాలెట్స్ సేవలను అందరూ ఎంజాయ్ చేయొచ్చు.
- జియో రాకతో యూపీఐ సేవల విభాగంలో పోటీ మరింత పెరిగింది.