KA Paul: వైఎస్ అవినాష్ రెడ్డిని కలిసిన కేఏ పాల్
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైస్ వివేకా హత్య కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం వైస్ అవినాష్ రెడ్డిని విచారిస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 06:33 PM, Thu - 25 May 23

KA Paul: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైస్ వివేకా హత్య కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డిని విచారిస్తుంది. పలు కీలక విషయాలను రాబట్టే క్రమంలో సీబీఐ అవినాష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తుంది. అయితే అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు సమయం కోరారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి కర్నూల్ లోని విశ్వభారతి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. తల్లి చికిత్స నిమిత్తం అవినాష్ రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఈ రోజు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అవినాష్ రెడ్డిని కలిశారు. చికిత్స పొందుతున్న అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్షిని పరామర్శించారు.
వైస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ అవినాష్ రెడ్డిని కలిసిన కేఏ పాల్ కేసు విషయంపై చర్చించినట్టు పాల్ చెప్పారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ… నిజానికి నేను టర్కీ వెళ్ళాల్సింది. కానీ అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసి కర్నూల్ లోని విశ్వభారతి ఆస్పత్రికి చేరుకున్నానని, శ్రీలక్షి గారిని పరామర్శించినట్టు పాల్ తెలిపారు. అనంతరం అవినాష్ రెడ్డితో వివేకా కేసు గురించి చర్చించినట్టు పాల్ తెలిపారు. వివేకా హత్య కేసులో నా ప్రమేయం లేదని, ఉద్దేశపూర్వంగానే ఈ కేసులో ఇరికిస్తున్నట్టు అవినాష్ నాతో చెప్పారని పాల్ పేర్కొన్నారు. కాగా పాల్ స్పందిస్తూ.. ఈ కేసులో అవినాష్ రెడ్డికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. నిర్దోషిని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు పాల్.
కాగా వారం క్రితం అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటు కారణంగా కర్నూల్ విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుండె నాళాల్లో ఇన్ఫెక్షన్ వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న బుధవారం వైఎస్ఆర్ సోదరి విమలమ్మ శ్రీలక్షిని కలిసి పరామర్శించారు. ఈ రోజు కేఏ పాల్ అవినాష్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More: CM Siddaramaiah: సిద్ధరామయ్యకు ప్రాణహాని.. కర్ణాటకలో చిచ్చు రేపుతున్న వ్యాఖ్యలు!

Tags
- cbi
- ka paul
- karnool
- MP YS Avinash Reddy
- Srilakshmi
- Vimalamma
- viswabharathi hospital
- YS Viveka murder
- YSR Sister

Related News

Delhi Liquor Policy Case: మద్యం కేసులో సిసోడియాకు మరో ఎదురుదెబ్బ
ఎక్సైజ్ పాలసీ విషయంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు.