Janasena : కదల్లేని వారాహి, ఢిల్లీ బీజేపీ చేతిలో స్టీరింగ్
జనసేనాని(Janasena) పవన్ వారాహి వాహనానికి కోట్ల విలువైన పబ్లిసిటీ వచ్చింది. కానీ, ఇప్పుడు
- By CS Rao Published Date - 04:58 PM, Wed - 12 April 23

జనసేనాని(Janasena) పవన్ వారాహి(Varahi) వాహనానికి కొన్ని కోట్ల విలువైన పబ్లిసిటీ వచ్చింది. కానీ, ఇప్పుడు అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియడంలేదు. అంతేకాదు, బయటకు వస్తుందా? రాదా? అనేది కూడా సందిగ్ధమే. ఇలాంటి పరిస్థితి ఎందుకు పవన్ కు వచ్చింది? ఢిల్లీ వెళ్లొచ్చిన తరువాత మౌనంగా ఆయన ఉంటున్నారు? చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేయాలని ఢిల్లీ దిశానిర్దేశం జరిగిందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్కో వారాహి చుట్టూ తిరుగుతున్నాయి.
జనసేనాని పవన్ వారాహి వాహనానికి పబ్లిసిటీ (Janasena)
ఇటీవల జనసేనాని (Janasena)ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షాను కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ, నడ్డాను మాత్రం కలిసినట్టు అధికారికంగా బయటకు వచ్చింది. ఆ తరువాత మీడియా ముందుకు పవన్ వచ్చినప్పటికీ ప్రత్యేకంగా ఏమీ వెల్లడించలేదు. తన మనసులో ఏముందో, ఢిల్లీ బీజేపీ అగ్రనేతల మదిలోనూ అదే ఉంది అంటూ చెప్పారు. అంటే, తొలుత పవన్ మనసులోకి మనం దూరాలి. ఆయన టీడీపీతో కలిసి వెళ్లాలని ఉన్నారని జనసైనికుల్లోని సింహభాగం చెబుతుంటారు. అలాంటి ఆలోచన బీజేపీ చేస్తుందా? అంటే డౌటే.
టీడీపీ బలహీన పడితే బీజేపీ బలంపడుతుందని
ప్రస్తుతం టీడీపీ , వైసీపీ పార్టీలు ఏపీలో బలంగా ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి బలహీనపడితేనే బీజేపీ, జనసేనకు(Janasena) స్థానం వస్తుంది. కాంగ్రెస్ మూలాలతో పుట్టిన పార్టీ వైసీపీ. ఒక వేళ ఆ పార్టీ బలహీనపడినప్పటికీ పెద్దగా బీజేపీకి ఒరిగేది ఏమీ ఉండదు. ప్రత్యామ్నాయంగా మళ్లీ కాంగ్రెస్ ఎదిగే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్, వైసీపీ ఓటర్లు దాదాపుగా సమాంతరంగా ఉంటారు. అదే, టీడీపీ బలహీన పడితే బీజేపీ బలంపడుతుందని అంచనా. ఎందుకంటే, గత కొన్ని దశాబ్దాలుగా ఆ రెండు పార్టీలు పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. పైగా టీడీపీ, బీజేపీ ఓటర్లు సమాంతరంగా ఉంటారు. అందుకే, చంద్రబాబును రాజకీయంగా బలహీనపరిస్తే, ఆ స్థానంలో బీజేపీ ఎదగాలని ఢిల్లీ బీజేపీ అగ్రనేతల ఆశ. కానీ, ఇప్పట్లో ఆ విధంగా జరగదని వాళ్లకు తెలుసు. అప్పటి వరకు దూరం నుంచి వేచి చూడాలని పవన్ కల్యాణ్ కు కూడా లక్ష్మణ రేఖ గీసినట్టు తెలుస్తోంది.
పులి మీద స్వారీ చేస్తున్నట్టు పవన్ కల్యాణ్
ప్రస్తుతం పులి మీద స్వారీ చేస్తున్నట్టు పవన్ కల్యాణ్(Janasena) పరిస్థితి రాజకీయంగా ఉందని చెప్పొచ్చు. రాజకీయంగా వీరమరణం పొందకుండా ఉండాలంటే టీడీపీతో ఆయనకు పొత్తు అవసరం. ఆ దిశగా అడుగులు వేస్తే, కేంద్రంలోని బీజేపీ ఏమి చేస్తుందో పవన్ కు తెలుసు. ఒకానొక సందర్భంగా విలీనం చేయాలని ఒత్తిడి చేసినట్టు కూడా పవన్ సూచాయగా క్యాడర్ కు తెలియచేసిన సందర్భం ఉంది. అంటే, బీజేపీ ఢిల్లీ పెద్దలను కాదని టీడీపీ వైపు వెళితే, చాలా సమస్యలను పవన్ ఎదుర్కొవాల్సి ఉంటుంది. దానికి ఎదురొడ్డి నిలబడే ధైర్యం పవన్ కు ఉంటుందని రాజకీయాలు తెలిసిన వాళ్లు భావించరు.
Also Read : TDP – Janasena: టిడిపి – జనసేన మధ్య ఢిల్లీ గిల్లుడు
చంద్రబాబును దూరంగా చేసుకుని బీజేపీతో కలిసి వెళితే ఏపీ జనం ఆదరించరు. ఆ విషయాన్ని తాజా సర్వేలు చెబుతున్నాయి. అంటే, వీరమరణం రాజకీయంగా పొందడం కళ్లెదుట కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో డిపాజిట్లు రాకపోతే, గ్లాస్ సింబల్ గల్లంతు కావడం ఖాయం. ఇప్పటి వరకు జనసేనకు గుర్తింపు లేదని ఈసీ చెబుతోంది. కేవలం రిజిస్ట్రర్ పార్టీగా మాత్రమే ఉంది. దానికి గుర్తింపు రావాలంటే ఈసీ నిబంధనల మేరకు ఓట్లు, సీట్లు రావాలి. అందుకే, బీజేపీతో కలిసి వెళితే రాజకీయ వీరమరణం తప్పదని భావించే వాళ్లు ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో వారాహిని(Varahi) ఎప్పుడు బయటకు తీస్తారు? అనేది చెప్పలేం.
Also Read : Pawan Kalyan : వైసీపీ రహిత ఏపీ లక్ష్యంగా బీజేపీ, జనసేన పనిచేస్తాయి – జనసేనాని పవన్