HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jana Sena To Conduct Three Day Party Meeting

Janasena : నేటి నుండి మూడు రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు

Janasena : 30న జరిగే మహాసభలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇప్పటికే డిజిటల్ పాసులు పంపిణీ చేయగా, మ్యాన్యువల్ పాసులను కూడా అందజేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు

  • Author : Sudheer Date : 28-08-2025 - 10:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Senathosenani
Senathosenani

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆధ్వర్యంలో ఈ నెల 30న విశాఖపట్నంలో జరగబోయే భారీ సభపై రాష్ట్ర రాజకీయ వర్గాలన్నీ దృష్టి సారించాయి. “సేనతో సేనాని” (Sena Tho Senani) పేరుతో మూడు రోజులపాటు జరిగే ఈ విస్తృత స్థాయి సమావేశాల్లో చివరి రోజున ఇందిరా ప్రియదర్శిని మైదానంలో మహాసభ జరుగనుంది. ఈ సభకు “మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సభా ప్రాంగణం”గా పేరు పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య సమరయోధుల పట్ల గౌరవాన్ని వ్యక్తం చేశారు.

KCR : కేటీఆర్ కు కేసీఆర్ ఫోన్… కీలక ఆదేశాలు

జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “జనసేన పార్టీకి వెన్నెముకగా నిలిచింది జనసైనికుల పోరాటాలు, మహిళల తెగింపు” అని అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, సభ ప్రాంగణానికి వచ్చే ఐదు ద్వారాలకు ఉత్తరాంధ్ర మహనీయులైన తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, గురజాడ అప్పారావు, వీరనారి గున్నమ్మ, మహాకవి శ్రీశ్రీ పేర్లు పెట్టాలని పవన్ నిర్ణయించారు. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో విశేష ఉత్సాహాన్ని నింపిందని ఆయన అన్నారు.

మూడు రోజుల సమావేశాల్లో పార్టీ భవిష్యత్తు దిశను పవన్ కళ్యాణ్ నిర్దేశించనున్నారు. 29న మేధావులు, విద్యావంతులు, యువతతో పవన్ ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. 30న జరిగే మహాసభలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇప్పటికే డిజిటల్ పాసులు పంపిణీ చేయగా, మ్యాన్యువల్ పాసులను కూడా అందజేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. వాతావరణం అనుకూలించకపోయినా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో జరుగుతున్నాయని జనసేన నాయకులు వెల్లడించారు. ఈ సమావేశాలు పార్టీ భవిష్యత్తు వ్యూహరచనకు కీలకమవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jana Sena To conduct three-day party meeting
  • Janasena
  • Pawan Kalyan
  • Visakhapatnam

Related News

Balineni

Janasena : రాయలసీమపై జనసేన ఫోకస్.. బాలినేనికి కీలక బాధ్యతలు?

రాయలసీమ ప్రాంతంలో పార్టీ బలోపేతంపై జనసేన అధిష్ఠానం దృష్టి సారించించింది. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సేవ‌ల‌ను రాయ‌ల‌సీమ‌లో వినియోగించుకోవాల‌ని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు తర్వాత ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కేడర్ విస్తరణను వేగవంతం చేయడం లక్ష్యంగా జనసేన

  • Murder 1

    Murder : భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌.. వ‌డ‌దెబ్బ అంటూ డ్రామా..!

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd