KCR : కేటీఆర్ కు కేసీఆర్ ఫోన్… కీలక ఆదేశాలు
KCR : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆందోళన వ్యక్తం చేశారు.
- By Kavya Krishna Published Date - 10:03 AM, Thu - 28 August 25

KCR : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆందోళన వ్యక్తం చేశారు. వరద బాధితులకు అండగా నిలిచి సహాయ కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
కేసీఆర్ సూచనల మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని ఆయన స్పష్టం చేశారు.
Rohit-Virat: టీమిండియా వన్డే జట్టు గురించి అప్డేట్లు.. రోహిత్-విరాట్‌పై కీలక నిర్ణయం!
కేసీఆర్ స్వయంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం వంటి వరద ప్రభావిత జిల్లాల నేతలతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. అవసరమైన చోట తక్షణ సహాయం అందించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వరదల కారణంగా గ్రామాలు, పట్టణాల్లోని నివాస ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతింది. ప్రాజెక్టులు, చెరువుల నుంచి నీరు పొంగిపొర్లడంతో వందలాది ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. పొలాలు ఇసుక మేడలుగా మారిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇక వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో నేడు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యవసర సేవల విభాగాలు, విపత్తు నిర్వహణ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
Red Warning: తెలంగాణలోని ఈ జిల్లాలకు రెడ్ వార్నింగ్!