HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagans Role In My Husbands Murder Paritala Sunithas Sensational Comments

Paritala Sunitha: నా భ‌ర్త హ‌త్య‌లో జ‌గ‌న్‌ పాత్ర ఉంది.. పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు.

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన భర్త పరిటాల రవి హత్యలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Author : Gopi Date : 03-04-2025 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Paritala Sunitha
Paritala Sunitha

Paritala Sunitha: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha) తన భర్త పరిటాల రవి హత్యలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. సీబీఐ ఆ రోజు జగన్‌ను విచారించిందని, టీవీ బాంబుతో పాటు కారు బాంబు, సూట్‌కేస్ బాంబు వంటి ఘటనలపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తోపుదుర్తి సోదరులు స్వార్థం కోసం ఫ్యాక్షన్‌ను రెచ్చగొడుతున్నారని, ఓబుల్ రెడ్డి, మద్దలచెరువు సూరి కుటుంబాలను ఇందులోకి లాగుతున్నారని ఆరోపించారు.

సునీత, గంగుల భానుమతి, కనుముక్కల ఉమాలకు ఆమె విజ్ఞప్తి చేస్తూ ఫ్యాక్షన్ వల్ల తమ మూడు కుటుంబాలు నష్టపోయాయని, దీని నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని, ప్రశాంతంగా ఉన్న సమయంలో తోపుదుర్తి సోదరులు మళ్లీ రెచ్చగొడుతున్నారని విమర్శించారు. పాపంపేటలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఇళ్లు కూల్చారని, దీనిని రెచ్చగొట్టేందుకు బాధితులను ఉసిగొల్పుతున్నారని తెలిపారు.

Also Read: India vs Pak War: భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం వస్తే.. ఎవరు గెలుస్తారు ?

ఎంపీపీ ఎన్నికల్లో తాను జోక్యం చేసుకోలేదని, అలా చేసి ఉంటే రామగిరి ఎంపీపీ టీడీపీ వశం అయ్యేదని స్పష్టం చేశారు. తోపుదుర్తి సోదరులు చంద్రబాబు, లోకేష్‌లపై అనుచితంగా మాట్లాడి, ఇప్పుడు కేసుల భయంతో వారిని గౌరవంగా సంబోధిస్తున్నారని విమర్శించారు. జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా తోపుదుర్తి సోదరుల మాటలు వింటున్నారని, శుక్రవారం పాపిరెడ్డిపల్లికి వస్తానంటూ ఫ్యాక్షన్‌ను రగిలించవద్దని సూచించారు. లింగమయ్యతో పాటు వైఎస్ఆర్‌సీపీ బాధితులను కూడా పరామర్శించాలని కోరారు.

పరిటాల రవి ఎలా చనిపోయారు?

పరిటాల రవి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత సంచలనాత్మక ఘటనల్లో ఒకటి. పరిటాల రవి 2005 జనవరి 24న అనంతపురం జిల్లాలోని పెనుకొండలోని పార్టీ కార్యాలయం వద్ద బహిరంగంగా కాల్పులకు గురై హత్య చేయబడ్డాడు. ఈ దాడిలో అతని గన్‌మన్, సన్నిహిత అనుచరుడు కూడా మరణించారు. ఈ హత్య వెనుక దీర్ఘకాలంగా నడుస్తున్న కుటుంబ వైరం, రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రధాన కారణాలుగా చెబుతుంటారు. ప‌రిటాల రవి- కాంగ్రెస్ నాయకుడు గంగుల సూర్యనారాయణ రెడ్డి (మద్దలచెరువు సూరి) కుటుంబాల మధ్య ఉన్న వైరం ఈ హత్యకు దారితీసిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • Paritala Ravi
  • Paritala Sunitha
  • politics
  • tdp
  • ycp
  • ys jagan

Related News

Midhun Reddy

Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మహిళల భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉండటం నేరస్తులను ప్రోత్సహించినట్లే అవుతుందని మిథున్ రెడ్డి హెచ్చరించారు

  • Jagan Fever Attack

    YCP Jagan : జగన్ కు గుడ్ న్యూస్ తెలిపిన CBI కోర్ట్

  • nara lokesh with pawan kalyan

    నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

Latest News

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

  • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

  • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

  • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

  • హోర్ముజ్ జలసంధి.. ఇండియన్ నేవీ కొత్త అడ్వైజరీ!

Trending News

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd