YS Jagan Chittoor Tour : జగన్ తోతాపురి మామిడి షో డిజాస్టర్
YS Jagan Chittoor Tour : ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి జగన్ శ్రేణులు పెద్ద ఎత్తున ఖర్చు చేసినా, ప్రజల్లో ఆసక్తి కలిగించలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు
- By Sudheer Published Date - 07:13 PM, Wed - 9 July 25

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన తోతాపురి మామిడి (Jagan Totapuri mango) ఈవెంట్ పెద్ద దుమారాన్ని రేపింది. మామిడి పంట ధరలు లేక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించేందుకు వచ్చినట్లు ప్రకటించినా, ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయ ముసుగులో సాగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈవెంట్‌కు ముందు మామిడికాయలను రోడ్లపై పోసి వాటిని ట్రాక్టర్లతో తొక్కించడంతో ఇది ముందే స్క్రిప్ట్ రచించిన ‘డ్రామా’లా మారిపోయిందని పలువురు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తోటపరిధి రైతులు వచ్చినట్లు కాకుండా జగన్ శిబిరం నుంచే కార్యకర్తలు రప్పించబడ్డారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి జగన్ శ్రేణులు పెద్ద ఎత్తున ఖర్చు చేసినా, ప్రజల్లో ఆసక్తి కలిగించలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోలీసుల అనుమతిని పట్టించుకోకుండా, బహిరంగంగా తోపులాటలు సృష్టించటం, కార్యకర్తలను గుంపుగా కదిలిరావడం ఇవన్నీ కార్యాచరణకు ముందుగా ఏర్పాటుచేసిన వ్యూహాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్దతు ధరల గురించి జగన్ చేసిన ఆరోపణలూ ఈవెంట్‌కి అనుకున్న స్థాయిలో స్పందన తెచ్చినట్లు లేదు. ప్రజలు దీనిని “ఓ రాజకీయ నాటకంగా” చూస్తున్నారని పలువురు వ్యాఖ్యానించారు.
ఇలాంటి కార్యక్రమాలు ప్రజల సహానుభూతిని పొందేందుకు కాకుండా, ప్రత్యర్థులను విమర్శించేందుకు జరుపుతున్నట్లు తేటతెల్లమవుతోంది. జగన్ చేసే పర్యటనల్లో కార్యకర్తలపై కేసులు బనాయించి వారిని బలిగా మారుస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైతుల పంటను రోడ్లపై పడేసి అపహాస్యం చేయడమే కాకుండా, అసలు సమస్యల పరిష్కారానికి దారి చూపకుండా విమర్శలతో కాలం తన్నే ప్రయత్నంగా ఈ ఈవెంట్ మిగిలిపోయింది. ప్రజల మనసుల్లో జగన్ పర్యటన ఎలాంటి ముద్ర వేశిందో త్వరలోనే స్పష్టమవుతుంది.