Jagan@Kuppam:చంద్రబాబు ఇలాఖాలో జగన్ భారీ ఎంట్రీ
టీడీపీ చీఫ్ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోకి జగన్మోహన్ రెడ్డి భారీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల చంద్రబాబు కుప్పం వెళ్లిన సందర్భంగా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు.
- Author : CS Rao
Date : 23-09-2022 - 12:31 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ చీఫ్ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోకి జగన్మోహన్ రెడ్డి భారీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల చంద్రబాబు కుప్పం వెళ్లిన సందర్భంగా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. అంతుకుమిన్నగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాన్ని వైసీపీ తరలించింది. జగన్ పర్యటన నేపథ్యంలో కుప్పం పట్ణణం వైసీపీ శ్రేణులతో నిండిపోయింది. రోడ్డుకిరువైపులా వైసీపీ జెండాలు, జగన్ ఫ్లెక్సీలతో ముంచెత్తారు.

ముఖ్యమంత్రి హోదాలో జగన్ కుప్పంకు విచ్చేయడం ఇదే తొలిసారి. నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో పాల్గొంటారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత కుప్పం మున్సిపాలిటీకి సంబంధించిన సుమారు రూ. 66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇటీవల రూ. 11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.

విజయవాడ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడ నుంచి ర్యాలీగా వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డిని కుప్పం నియోజకవర్గం వరకు తీసుకెళ్లారు.
మన టార్గెట్ 175#KuppamGaddaYCPAdda #ThisTime175 pic.twitter.com/Ev1QGaRHv6
— YSR Congress Party (@YSRCParty) September 23, 2022